News April 24, 2025
అనకాపల్లి: మే 19 నుంచి ఓపెన్ స్కూల్ సప్లమెంటరీ పరీక్షలు

అనకాపల్లి జిల్లాలో ఓపెన్ స్కూల్‌కు సంబంధించి సెకండరీ బోర్డు, 10వ తరగతి పరీక్షలు మే 19 నుంచి నిర్వహించనున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి అప్పారావు నాయుడు తెలిపారు. మే 28వరకు పరీక్షలు జరుగుతాయన్నారు. ఈ నెల 24 నుంచి 30లోగా పరీక్ష ఫీజు చెల్లించాలని సూచించారు. అధికారిక వెబ్‌సైట్‌లో హెచ్.ఎం లాగిన్ నుంచి ఫీజు చెల్లించాలని పేర్కొన్నారు.
Similar News
News April 24, 2025
బాపట్లలో రేపు ఎస్టీలు, దివ్యాంగులకు ప్రత్యేక గ్రీవెన్స్

ఎస్టీలు, దివ్యాంగులకు ప్రత్యేక గ్రీవెన్స్ సెల్ ప్రతినెల మూడో శుక్రవారం నిర్వహిస్తున్నట్లు బాపట్ల కలెక్టర్ వెంకట మురళి గురువారం పేర్కొన్నారు. తమ సమస్యలు విన్నవించుకోవడానికి జిల్లాలో దివ్యాంగులు, ఎస్టీలు ప్రత్యేక గ్రీవెన్స్ సెల్‌కు రావచ్చన్నారు. ఈ విషయాన్ని జిల్లాలోని ఎస్టీలు, దివ్యాంగులు గమనించాలని, ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
News April 24, 2025
VKB: అనంతగిరి కొండలను పర్యాటకంగా అభివృద్ధి: స్పీకర్

అనంతగిరి కొండలను పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికతో ముందుకు సాగుతుందని స్పీకర్ ప్రసాద్ కుమార్ తెలిపారు. గురువారం వికారాబాద్ అనంతగిరి కొండల్లో స్పీకర్ ప్రసాద్ కుమార్ మొక్కలు నాటారు. ఆయన మాట్లాడుతూ.. అనంతగిరి కొండలు ప్రకృతి రమణీయతకు మారుపేరుగా నిలుస్తాయని, పర్యాటకులకు అనుకూలంగా అనంతగిరి కొండలను అభివృద్ధిలో తీర్చిదిద్దనున్నట్లు పేర్కొన్నారు.
News April 24, 2025
శని, ఆదివారాల్లో పిడుగులతో కూడిన వర్షాలు

AP: రాష్ట్రంలో రానున్న 3రోజులు భిన్న వాతావరణ పరిస్థితులు నెలకొననున్నాయి. శుక్రవారం 17 మండలాల్లో(శ్రీకాకుళం 4,విజయనగరం 5, మన్యం 8) తీవ్ర వడగాలులు వీచే అవకాశమున్నట్లు APSDMA వివరించింది. ఇవాళ నంద్యాల(D) దొర్నిపాడులో 43.8°C అధిక ఉష్ణోగ్రత నమోదైనట్లు పేర్కొంది. మరోవైపు శని, ఆదివారాల్లో ఉత్తరాంధ్రలోని పలుచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని అంచనా వేసింది.