News March 12, 2025

అనకాపల్లి: రాష్ట్ర పండుగగా నూకాంబిక అమ్మవారి జాతర

image

అనకాపల్లి నూకాంబిక అమ్మవారి జాతరకు రాష్ట్ర పండగగా గుర్తింపు లభించింది. ఈ మేరకు బుధవారం రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి వినయ్ చంద్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈనెల 28 కొత్త అమావాస్య నుంచి వచ్చేనెల 27వ తేదీ వరకు అమ్మవారి జాతర జరుగుతుంది. ఇటీవల నూకాంబిక జాతరను రాష్ట్ర పండుగగా గుర్తించాలని సీఎం చంద్రబాబుకు అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్, ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ విజ్ఞప్తి చేశారు.

Similar News

News March 13, 2025

జూన్ నాటికి అర్హులకు 5 లక్షల ఇళ్లు: మంత్రి

image

AP: రాష్ట్రంలో ఈ ఏడాది జూన్ నాటికి 5 లక్షల ఇళ్లు నిర్మించి అర్హులకు ఇస్తామని మంత్రి పార్థసారథి చెప్పారు. పేదల ఇళ్ల నిర్మాణానికి కేంద్రం ఇచ్చిన నిధులను గత వైసీపీ ప్రభుత్వం ఇష్టానుసారంగా ఉపయోగించిందని దుయ్యబట్టారు. తాము అధికారంలోకి వచ్చాక 1.25 లక్షల నిర్మాణాలు పూర్తి చేశామని, మిగిలిన 7.25 లక్షల గృహ నిర్మాణాలను 2026 మార్చిలోగా పూర్తి చేస్తామని పేర్కొన్నారు.

News March 13, 2025

ఓటీటీలో అదరగొడుతున్న కొత్త సినిమా

image

నాగచైతన్య, సాయిపల్లవి జంటగా తెరకెక్కిన చిత్రం ‘తండేల్’ ఓటీటీలో అదరగొడుతోంది. ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో దేశవ్యాప్తంగా నం.1గా ట్రెండ్ అవుతోందని నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ ట్వీట్ చేసింది. బ్లాక్‌బస్టర్ సునామీ ప్రేక్షకులకు ఫేవరెట్‌గా మారిందని పేర్కొంది. చందూ మొండేటి దర్శకత్వం వహించిన ఈ మూవీ రూ.115 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది.

News March 13, 2025

త్రిభాష విధానానికి సుధామూర్తి మద్దతు

image

జాతీయ విద్యా విధానంలోని త్రీ లాంగ్వేజ్ పాలసీకి ఇన్ఫోసిస్ కోఫౌండర్ నారాయణ మూర్తి భార్య, రాజ్యసభ ఎంపీ సుధామూర్తి మద్దతు తెలిపారు. దీంతో పిల్లలు చాలా నేర్చుకునే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. తనకు ఏడెనిమిది భాషలు తెలుసని చెప్పారు. కాగా ఈ విధానాన్ని తమిళనాడు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. కేంద్రం కావాలనే తమపై మూడో భాషను రుద్దే ప్రయత్నం చేస్తోందని విమర్శిస్తోంది.

error: Content is protected !!