News January 30, 2025
అనకాపల్లి: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

అనకాపల్లి పట్టణ పూడిమడక బస్ స్టాప్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వృద్ధుడు దుర్మరణం చెందాడు. బుధవారం షేక్ సుభాన్ (60) ఆగి ఉన్న ఆర్టీసీ బస్సు ముందు నుంచి నడిచి వెళుతున్నాడు. ఆ సమయంలోనే డ్రైవర్ గమనించకుండా బస్సును నడపడంతో సుభాన్‌ను ఢీకొంది. దీంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Similar News
News March 14, 2025
మార్చి 14: చరిత్రలో ఈ రోజు

* 1879: భౌతిక శాస్త్రవేత్త ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ జననం
* 1883: రాజకీయ-ఆర్థికవేత్త కార్ల్ మార్క్స్ మరణం
* 1890: మలయాళ పత్రిక ‘మలయాళ మనోరమ’ సర్క్యులేషన్ ప్రారంభం
* 1918: సినీ సంగీత దర్శకుడు కేవీ మహదేవన్ జననం
* 1931: తొలి టాకీ చిత్రం ‘ఆలం ఆరా’ ముంబైలో విడుదల
* 1965: బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్ జననం
* 2018: భౌతిక శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ మరణం
News March 14, 2025
ADB: మూడు రోజులు కొనుగోళ్లు బంద్

ఆదిలాబాద్ మార్కెట్ కమిటీ పరిధిలో కందులు, శనగ కొనుగోళ్లను మూడు రోజుల పాటు తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ఆదిలాబాద్ సెంటర్ ఇన్ఛార్జ్ కేంద్రే పండరీ తెలిపారు. శుక్రవారం హోలీ పండుగ, ఆదివారం రావడంతో కొనుగోళ్లు నిలిపివేస్తున్నట్లు పేర్కొన్నారు. తిరిగి ఈ నెల 17 నుంచి కొనుగోళ్లు యథావిధిగా జరుగుతాయని వెల్లడించారు. రైతులు గమనించాలని కోరారు.
News March 14, 2025
చిత్తూరు: శక్తి టీంలను వెంటనే ఏర్పాటు చేయాలి

జిల్లా అంతట శక్తి టీంలను వెంటనే ఏర్పాటు చేయాలని ఎస్పీ మణికంఠ ఆదేశించారు. సిబ్బందితో నేర సమీక్ష సమావేశంలో గురువారం ఆయన మాట్లాడారు. అసాంఘిక కార్యకలాపాలపై డ్రోన్లతో నిఘా పెంచాలని సూచించారు. సీసీ కెమెరాల ప్రాముఖ్యతపై అవగాహన కల్పించాలన్నారు. సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడకుండా ప్రజలను చైతన్య పరచాలన్నారు. అక్రమ రవాణాపై ఉక్కు పాదం మోపాలన్నారు.