News April 17, 2025

అనకాపల్లి: రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి

image

అనకాపల్లి కొత్తూరు జంక్షన్ వద్ద బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. స్థానిక ఎన్జీవోస్ కాలనీ నుంచి ద్విచక్ర వాహనంపై పరికి ప్రసాద్ (60) అతని భార్య వెళుతుండగా ఉమ్మలాడ నుంచి కసింకోట వస్తున్న మరో ద్విచక్ర వాహనం వెనుక నుంచి ఢీకొంది. ప్రసాద్ దంపతులతో పాటు మరో వాహనదారుడు గాయపడ్డారు. స్థానిక ఎన్టీఆర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రసాద్ మృతి చెందాడు.

Similar News

News April 19, 2025

అలంపూర్ ఆలయ అభివృద్ధికి హై లెవెల్ కమిటీ పరిశీలన

image

అలంపూర్ ఆలయ అభివృద్ధి, భక్తుల సౌకర్యార్థం హై లెవెల్ కమిటీ చేపడుతున్న పలు అభివృద్ధి పనులలో భాగంగా శనివారం ఆలయ కమిటీ సభ్యులు సమావేశమయ్యారు. సభ్యులైన దేవాదాయ శాఖ స్థపతి వల్లినాయగం, సభ్యులు & దేవాదాయ శాఖ ధార్మిక అడ్వైజర్ గోవింద హరి, ఆర్కిటెక్ట్ సూర్యనారాయణ మూర్తి, శృంగేరి పీఠాధిపతుల వారి శిష్య బృందం ఆలయాన్ని సందర్శించింది. అనంతరం అభివృద్ధి గురించి చర్చించారు.

News April 19, 2025

ఆ 27మందిపై అనర్హత వేటు వేయండి: వైసీపీ 

image

జీవీఎంసీ ఇన్‌ఛార్జ్ కమిషనర్ హరేంద్ర ప్రసాద్‌ను వైసీపీ నేత తైనాల విజయ్ కుమార్ కలిశారు. విప్ ధిక్కరించిన 27 మంది కార్పొరేటర్లపై ఫిర్యాదు చేశారు. జీవీఎంసీ కాన్ఫిడెన్స్ ఇన్ మేయర్ రూల్స్-2008 ప్రకారం వైసీపీ గుర్తుపై గెలిచి కూటమికి మద్దతు ఇవ్వడం ప్రొసీడింగ్స్ ప్రకారం తప్పని.. 27మంది కార్పొరేటర్లపై అనర్హత వేటు వేయాలని కోరారు. విప్ కాపీని అందజేశారు.

News April 19, 2025

ఈ అలవాట్లతో మీ లివర్ రిస్క్‌లో పడ్డట్లే..

image

చక్కెర అధికంగా ఉన్న పదార్థాలు తీసుకోవడం వల్ల అది కొవ్వుగా మారి ఫ్యాటీ లివర్ డిసీజ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఫ్రై ఫుడ్స్‌ కాలేయంపై భారాన్ని పెంచుతాయి. మాంసం అధికంగా తినడం వల్ల శరీరంలో అమ్మోనియా స్థాయులు పెరుగుతాయి. పెయిన్ కిల్లర్స్, వెయిట్ లాస్ మెడిసిన్స్ వల్ల కాలేయంపై ప్రభావం పడే అవకాశముంది. లివర్ చెడిపోవడానికి ఆల్కహాల్ ప్రధాన కారణమని, కనుక ఈ అలవాటును పూర్తిగా మానుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

error: Content is protected !!