News April 16, 2025
అనకాపల్లి: వచ్చెనెల ఒకటో తేదీ నుంచి వేసవి క్రీడా శిక్షణ

అనకాపల్లి జిల్లాలో మే1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు విద్యార్థులకు వేసవి క్రీడా శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ అధికారి రమణ మంగళవారం తెలిపారు. 8 నుంచి 14 సంవత్సరాల వయసు గల విద్యార్థులు శిక్షణ శిబిరంలో పాల్గొనవచ్చునన్నారు. ఆసక్తి గలవారు ఈనెల 17వ తేదీ లోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు.
Similar News
News April 19, 2025
సిద్దిపేట: ఫోన్ పట్టి టైం వేస్ట్ చేసుకోవద్దు: హరీశ్ రావు

విద్యార్థులు వేసవి సెలవుల్లో మొబైల్ ఫోన్ పట్టుకొని టైం వేస్ట్ చేయొద్దని ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్ రావు సూచించారు. శనివారం సిద్దిపేటలో ఏర్పాటు చేసిన ‘భద్రంగా ఉండాలి- భవిష్యత్తులో ఎదగాలి’ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. సెలవుల్లో పుస్తక పఠనం చేసి తెలియని వాటిని తెలుసుకోవాలని సూచించారు. మొబైల్ ఫోన్లలో గేమ్స్ ఆడుతూ, రీల్స్ చూస్తూ సమయాన్ని వృథా చేసుకుంటే మనకే నష్టమని అన్నారు.
News April 19, 2025
ఇషాంత్ శర్మకు వడదెబ్బ!

అహ్మదాబాద్‌లో జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ బౌలర్ ఇషాంత్ శర్మకు వడదెబ్బ తగిలింది. ఆయన్ను బౌండరీ లైన్ బయటికి తీసుకెళ్లిన GT సిబ్బంది, లిక్విడ్స్ అందించి తడి టవల్స్‌తో సపర్యలు చేశారు. స్టేడియం వద్ద ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటేయడంతో అటు గుజరాత్, ఇటు ఢిల్లీ జట్ల ఆటగాళ్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బ్యాటింగ్ చేస్తున్న ఢిల్లీ కెప్టెన్ అక్షర్ పటేల్ సైతం ఎండ దెబ్బకు ఇబ్బంది పడ్డారు.
News April 19, 2025
విశాఖ అభివృద్ధే సీఎం లక్ష్యం: మంత్రి డోలా

వైసీపీ 5 ఏళ్ల పాలనలో జీవీఎంసీలో జరిగిన అభివృద్ధి శూన్యమని విశాఖ జిల్లా ఇన్ ఛార్జ్ మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి స్వామి అన్నారు. శనివారం ఆయన జీవీఎంసీలో మేయర్‌పై అవిశ్వాసం నెగ్గిన సందర్భంగా కూటమి కార్పొరేటర్లతో కలిసి మాట్లాడారు. వైసీపీ అరాచకాలు అడ్డుకునేందుకే కార్పొరేటర్లు తిరుగుబాటు చేశారని పేర్కొన్నారు. విశాఖను అన్ని విధాల అభివృద్ధి చేయాలన్నదే సీఎం చంద్రబాబు లక్ష్యం అన్నారు.