News April 8, 2025

అనకాపల్లి: హత్య కేసులో నిందితుడికి జీవిత ఖైదు

image

హత్య కేసులో నిందితుడికి జిల్లా కోర్టు జీవిత ఖైదు విధించినట్లు ఎస్పీ తుహీన్ సిన్హా సోమవారం తెలిపారు. కశింకోట పెట్రోల్ బంక్ వద్ద 2018 జూన్ 8న లారీ డ్రైవర్ శర్వన్ కుమార్ గణపతి, మృతుడు మునిరాజు మధ్య వివాదం జరిగింది. తరువాత మునిరాజు పెట్రోల్ బంక్ సమీపంలో విశ్రమిస్తుండగా శర్వన్ కుమార్ రాయితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. మునిరాజు కేజీహెచ్ లో చికిత్స పొందుతూ జూన్ 9న మృతి చెందినట్లు తెలిపారు.

Similar News

News April 17, 2025

ఆత్రేయపురం: కాలు జారి వ్యక్తి గల్లంతు

image

ఆత్రేయపురం మండలం ర్యాలీ గ్రామ శివారు బుల్లియ్య రేవులో కాలువ వద్ద  వ్యక్తి కాలు జారి గల్లంతయ్యాడు. స్థానికుల వివరాల ప్రకారం.. బుల్లియ్య రేవుకు చెందిన విత్తనాల భాస్కరరావు(68) బుధవారం ఉదయం కాలువ వద్దకు స్నానం చేస్తుండగా ప్రమాదవశాత్తు కాలుజారి గల్లంతయ్యాడు. వెంటనే విషయం తెలుసుకున్న బంధువులు, జాలర్లు కలిసి అమలాపురం కాలవ గట్టున గాలింపు చర్యలు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News April 17, 2025

ఫెయిలైన విద్యార్థులకు స్పెషల్ క్లాసులు

image

AP: రాష్ట్రంలోని ఆదర్శ పాఠశాలల్లో చదువుతూ ఇంటర్ ఫెయిలైన, తక్కువ మార్కులు వచ్చిన విద్యార్థులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వారికి వేసవిలో ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహించాలని నిర్ణయించింది. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు ఈ తరగతులు నిర్వహిస్తారు. ఇందుకోసం కేజీబీవీ హాస్టళ్లను ఉపయోగించుకోవాలని భావించింది. కాగా ఆదర్శ పాఠశాలల్లో ఫస్టియర్‌లో 44%, సెకండ్ ఇయర్‌లో 18% శాతం మంది ఫెయిలయ్యారు.

News April 17, 2025

కాంగ్రెస్ అంటే మోసగాళ్ల పార్టీ: జగదీశ్ రెడ్డి

image

కాంగ్రెస్ అంటే మోసగాళ్ల, ఢీల్లీ గులాముల పార్టీ అని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఈనెల 27న వరంగల్‌లో జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ సభను విజయవంతం చేయాలని దేవరకొండలో నిర్వహించిన నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం ఏపీ సీఎం చంద్రబాబు చేతుల్లోకి పోతుందన్నారు. కాంగ్రెస్‌లో వాళ్లు వాళ్లే కొట్టుకుంటున్నారని ఏద్దేవా చేశారు.

error: Content is protected !!