News February 11, 2025

అనపర్తి: ప్రమాదవశాత్తు లిఫ్టు గుంతలో పడి వ్యక్తి మృతి

image

అనపర్తిలో ప్రమాదవశాత్తు లిఫ్టులో గుంతలో పడి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన సోమవారం జరిగింది. అనపర్తికి చెందిన సూర్యనారాయణ(65) తన కుమారుడు భాస్కరరావు నివసిస్తున్న అపార్ట్మెంట్‌కి వెళ్లి, తిరిగి ఇంటికి వెళ్లే క్రమంలో లిఫ్ట్ తెరిచి ఉన్నది చూసుకోకుండా లిఫ్టు గుంతలో పడ్డాడు. విషయం యజమాని భాస్కరరావుకు తెలపగా, అతను వచ్చి చూసేసరికి సూర్యనారాయణ మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Similar News

News April 21, 2025

తూ.గో. జిల్లాలో టీచర్ పోస్టులు ఇలా..!

image

ఉమ్మడి తూ.గో. జిల్లాలో డీఎస్సీ ద్వారా 1,241 పోస్టులు భర్తీ చేయనున్న విషయం తెలిసిందే. రోస్టర్ వారీగా పోస్టులు ఇలా కేటాయిస్తారు. ➤ OC-498 ➤ BC-A:88 ➤ BC-B:120 ➤ BC-C:13 ➤ BC-D:84 ➤ BC-E:48 ➤ SC-1:17 ➤ SC-2:79 ➤ SC-3:93 ➤ ST:74 ➤ EWS:120 ➤ PH-256:1 ➤ PH-05: 6. సబ్జెక్టుల వారీగా పోస్టుల కోసం << 16156039>>ఇక్కడ<<>> క్లిక్ చేయండి.

News April 21, 2025

తూ.గో: బాబోయ్ అడ్మిషన్‌లా..? భయపడిపోతున్న ప్రైవేట్ టీచర్స్

image

జిల్లాలో రాబోయే విద్యా సంవత్సరానికి అడ్మిషన్ల కోసం ప్రైవేట్ స్కూల్ టీచర్లు పరుగులు పెడుతున్నారు. కొన్ని స్కూల్స్‌లో అయితే టార్గెట్లు ఇవ్వడంతో ఒత్తిడికి గురవుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మినిమం అడ్మిషన్లు తెస్తేనే జీతాలు ఇస్తామంటూ హుకుం జారీ చేయడంతో మండుటెండల్లో రోడ్ల వెంట పరుగులు పెడుతున్నారు. విద్యా సంవత్సరం మారుతున్న ప్రతిసారి ఇదే పరిస్థితి అంటూ వాపోతున్నారు.

News April 21, 2025

నేడు యథావిధిగా పీజీఆర్ఎస్ కార్యక్రమం: కలెక్టర్ 

image

ప్రజా సమస్యలు పరిష్కారo కోసం నిర్వహిస్తున్న పీజీఆర్ఎస్ కార్యక్రమం సోమవారం యథావిధిగా నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ ప్రశాంతి తెలిపారు. కలెక్టరేట్, డివిజన్, మున్సిపల్, మండల కేంద్రంలో ఉదయం 10 నుంచి మ.1గంట వరకు ప్రజల నుంచి అర్జీలను స్వీకరిస్తామన్నారు. ప్రత్యేక అధికారులు, జిల్లా, డివిజన్ మండల, మున్సిపల్ క్షేత్రస్థాయి అధికారులు తప్పనిసరిగా హాజరుకావాలని ఆమె ఆదేశించారు.

error: Content is protected !!