News March 10, 2025
అనాతవరం: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

ముమ్మిడివరం మండలం అనాతవరం సమీపంలో 216 జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్ ఆబోతును ఢీకొన్న ఘటనలో ఒక వ్యక్తి ఘటనా స్థలంలో మృతి చెందాడు. వెనక కూర్చున్న వ్యక్తికి గాయాలయ్యాయి. కాకినాడ నుంచి భీమవరం వెళ్తుండగా ప్రమాదం జరిగినట్టుగా సమాచారం. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News March 10, 2025
IPLలో ఆ యాడ్స్ బ్యాన్ చేయండి: కేంద్రం

మరికొన్ని రోజుల్లో IPL టోర్నీ ప్రారంభం కానుండగా కేంద్ర ఆరోగ్య శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం నిషేధించిన వాటితో పాటు పొగాకు, మద్యం ప్రకటనలను నిషేధించాలని కోరుతూ BCCIతో పాటు IPL ఛైర్మన్‌కు లేఖ రాసింది. అలాగే, క్రీడాకారులు, కామెంటేటర్స్ కూడా ప్రమోట్ చేయొద్దని ఆరోగ్య శాఖ డైరెక్టర్ లేఖలో పేర్కొన్నారు. IPLను యూత్ ఎక్కువగా చూస్తుండటంతో పొగాకు, మద్యం యాడ్స్ వీరిపై ప్రభావం చూపే అవకాశం ఉంది.
News March 10, 2025
అల్లూరి జిల్లాలో 115 మంది గైర్హాజరు

అల్లూరి జిల్లాలో ఇంటర్ సెకండియర్ వ్యాథ్స్, జువాలజి, హిస్టరీ పరీక్షలు సోమవారం జరిగాయి. ఈ జనరల్ పరీక్షలకు 26పరీక్ష కేంద్రాల్లో 4,315 మంది హాజరు కావాల్సి ఉండగా 4,200 మంది పరీక్షకు హాజరయ్యారు. 115 మంది పరీక్షకు హాజరుకాలేదని ఇంటర్మీడియట్ విద్యాశాకాధికారి అప్పలరాం తెలిపారు. ఒకేషనల్ పరీక్షలకు 1217మందికి 1136మంది రాశారని వెల్లడించారు. జిల్లా అంతటా ప్రశాంతంగా పరీక్షలు జరిగాయని పేర్కొన్నారు.
News March 10, 2025
రాష్ట్రంలో భారీ స్కామ్: కేటీఆర్

TG: రాష్ట్రంలో భారీ స్కామ్‌కు తెరలేసిందని, టీడీఆర్ బాండ్ల పేరుతో రూ.వేల కోట్లు కొల్లగొట్టేందుకు CM రేవంత్ టీమ్ సిద్ధమవుతోందని KTR ఆరోపించారు. రేవంత్‌కు చెందిన నలుగురు వ్యక్తులు HYDలో విచ్చలవిడిగా టీడీఆర్‌లు కొంటున్నారని పేర్కొన్నారు. ‘ఫార్ములా ఈ- రేసుకు రూ.45కోట్లు ఖర్చు చేస్తే తప్పు అన్నారు. ఇప్పుడు అందాల పోటీకి రూ.200కోట్లు ఖర్చు చేస్తారట. దీని వల్ల ఏమైనా లాభం ఉందా?’ అని ప్రశ్నించారు.