News April 15, 2025

అన్నమయ్య: గుర్రపు స్వారీ క్రీడా ప్రాంగణం ప్రారంభం

image

మదనపల్లె ఎమ్మెల్యే షాజహాన్ బాషా సోమవారం రాత్రి బసినికొండలో గుర్రపు స్వారీ క్రీడా ప్రాంగణాన్ని ప్రారంభించారు. యువతకు క్రీడల్లో స్ఫూర్తిని నింపే విధంగా ఇప్పటికే సెటిల్,  క్రికెట్, వాలీబాల్ కోర్టులను ఏర్పాటు చేశామని ఆయన పేర్కొన్నారు. ఇందులో భాగంగానే బసినికొండ వద్ద నూతనంగా గుర్రపు స్వారీ క్రీడా ప్రాంగణం ప్రారంభించామన్నారు. డాక్టర్ ఎన్.సేతు, షంషీర్, హరి పాల్గొన్నారు.

Similar News

News April 16, 2025

ఇక టోల్ గేట్లు ఉండవు: మంత్రి

image

జాతీయ రహదారులపై ఉండే టోల్‌గేట్స్ త్వరలోనే కనుమరుగవుతాయని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. వాహనాలు నెంబర్ శాటిలైట్ ట్రాకింగ్ ఆధారంగా వెహికిల్ ఓనర్ అకౌంట్లోనుంచి టోల్ ఛార్జ్ కట్ అయ్యేలా కొత్త టెక్నాలజీ తీసుకొస్తున్నట్లు తెలిపారు. ఆ నూతన పాలసీ అమలుపై 15రోజుల్లో ప్రకటన వస్తుందని మంత్రి పేర్కొన్నారు. టోల్ గేట్ల వద్ద వాహనదారుల రద్దీ దృష్ట్యా ఈ చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి తెలిపారు.

News April 16, 2025

KMR: నీటి ఎద్దడి నివారణకు ట్యాంకర్ల ద్వారా సరఫరా: కలెక్టర్

image

కామారెడ్డి జిల్లాలో ఎక్కడా నీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అధికారులను ఆదేశించారు. పట్టణంలో నీటి ఎద్దడి తలెత్తకుండా ట్యాంకర్ల ద్వారా సరఫరా చేయాలని సూచించారు. నూతనంగా కొనుగోలు చేసిన నీటి ట్యాంకర్లకు బుధవారం మున్సిపల్ కార్యాలయ ఆవరణలో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. పట్టణంలో నీటి సరఫరాకు ఆయన జెండా ఊపి ప్రారంభించారు.

News April 16, 2025

చైనా వస్తువులపై 245% టారిఫ్: US

image

అమెరికా-చైనాల మధ్య సుంకాల యుద్ధం తారస్థాయికి చేరింది. చైనా వస్తువులపై సుంకాన్ని ట్రంప్ ప్రభుత్వం 145 శాతం నుంచి 245 శాతానికి పెంచింది. దీంతో చైనా నుంచి దిగుమతి అయ్యే వస్తువుల ధరలు USలో విపరీతంగా పెరగనున్నాయి. ఫలితంగా అమెరికన్లు చైనా వస్తువులను కొనడం ఆపేయడంతో ఆ దేశ కంపెనీలు విపరీతంగా నష్టపోతాయి. కాగా అమెరికా వస్తువులపై చైనా 125% టారిఫ్స్ విధిస్తోంది.

error: Content is protected !!