News January 25, 2025

అన్నమయ్య జిల్లాకు మొదటి స్థానం

image

సౌత్ ఇండియా సైన్స్ ఫెయిర్‌లో అన్నమయ్య జిల్లా విద్యార్థులు మొదటి స్థానం సాధించారని జిల్లా సైన్స్ అధికారి మార్ల ఓబుల్ రెడ్డి తెలిపారు. ఈనెల 20 నుంచి 25వ తేది వరకు పుదుచ్చేరిలోని ఓల్డ్ పోర్ట్ గ్రౌండ్‌లో సౌత్ ఇండియా సైన్స్ ఫెయిర్ పోటీలు జరిగాయి. అన్నమయ్య జిల్లా కలకడ మోడల్ స్కూల్‌ విద్యార్థులు మహమ్మద్ సుహేల్, రెహాన్ మొదటి స్థానం కైవసం చేసుకున్నారు.

Similar News

News March 14, 2025

హోలీ.. సీఎం రేవంత్ పాత ఫొటోలు

image

TG: హోలీ పండుగ వేళ సీఎం రేవంత్ రెడ్డి పాత ఫొటోలను కొందరు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. నాటి ఆప్తమిత్రులతో కలిసి రేవంత్ రెడ్డి సంబరాలు చేసుకున్నారు. మరి పై ఫొటోల్లో సీఎం ఎక్కడ ఉన్నారో గుర్తు పట్టారా? కామెంట్ చేయండి.

News March 14, 2025

కామారెడ్డి బిడ్డ.. 3 GOVT జాబ్స్ సాధించారు..!

image

కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం కరడ్‌పల్లి గ్రామానికి చెందిన సంతోష్ 3 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారు. 2019లో అటవీ శాఖలో బీట్ అధికారిగా కొలువులో చేరారు. ఆ కొలువు చేస్తూనే.. జేఎల్‌కు సిద్ధమయ్యారు. అంతలోనే గ్రూప్-4 పరీక్ష రాసి.. ఎక్సైజ్ డిపార్ట్‌మెంట్‌లో జూనియర్ అసిస్టెంట్ అయ్యారు. ఇటీవల విడుదలైన ఫలితాల్లో జేఎల్ సాధించారు. బాల్కొండ ప్రభుత్వ జూనియర్ కాలేజీలో పోస్టింగ్ వచ్చింది.

News March 14, 2025

ప్రముఖ నటుడు కన్నుమూత

image

బాలీవుడ్ నటుడు దేబ్ ముఖర్జీ (83) కన్నుమూశారు. గత కొన్ని నెలలుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఇవాళ తుదిశ్వాస విడిచారు. అధికార్, జో జీతా వోహీ సికందర్ వంటి పలు సినిమాల్లో నటించారు. ఆయన కుమారుడు అయాన్ ముఖర్జీ హిందీ సినీ పరిశ్రమలో దర్శకుడిగా రాణిస్తున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్, హృతిక్ రోషన్ నటిస్తున్న ‘వార్-2’ను డైరెక్ట్ చేస్తున్నారు.

error: Content is protected !!