News April 23, 2025

అన్నమయ్య జిల్లాలో పదో తరగతి విద్యార్థి సూసైడ్

image

పదో తరగతి ఫెయిల్ కావడంతో అన్నమయ్య జిల్లాలో ఓ విద్యార్థి బలవనర్మణానికి పాల్పడ్డాడు. గుర్రంకొండ మండలం మర్రిపాడుకు చెందిన విద్యార్థి ఇటీవల పదో తరగతి పరీక్షలు రాశాడు. నేడు ఫలితాలు రాగా.. మ్యాథ్స్, సైన్స్‌లో ఫెయిలయ్యాడు. మనస్తాపంతో యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

Similar News

News April 24, 2025

మామునూరు ఎయిర్‌పోర్ట్ గురించి ఈ విషయాలు తెలుసా..?

image

WGL మామునూరు ఎయిర్‌పోర్ట్ను నిజాం పాలనలో 1930లో నిర్మించారు. జవహర్ లాల్ నెహ్రూతో సహా అనేకమంది ప్రధానమంత్రులు, రాష్ట్రపతులు 1981 వరకు వారి పర్యటనలకు ఈ విమానాశ్రయం ఉపయోగపడింది. ఈ విమానాశ్రయం షోలాపూర్‌లో వ్యాపారాభివృద్ధికి, సిర్పూర్ కాగజనగర్‌లో కాగితం పరిశ్రమ సౌకర్యార్థం నిర్మించారు. ఇది బేగంపేట విమానాశ్రయం కంటే అతి పురాతనమైంది. మామూనూర్ ఎయిర్పోర్ట్ నిర్మాణానికి కేంద్రం ఇటీవల గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

News April 24, 2025

KMR: ఉత్తమ సేవకు గుర్తింపు

image

కామారెడ్డి జయశంకర్ కాలనీ రైల్వే ట్రాక్‌పై ఆత్మహత్యకు ప్రయత్నించిన మహిళను కాపాడిన బ్లూ కోల్ట్ సిబ్బంది నరసింహులు, వసంత్‌లను జిల్లా SP రాజేశ్ చంద్ర అభినందించారు. బుధవారం జిల్లా పోలీసు కార్యాలయంలో వారి సమయస్ఫూర్తిని మెచ్చుకుంటూ.. నగదు పురస్కారాన్ని అందజేశారు. అలాగే డయల్ 100కు వెంటనే సమాచారం అందించిన కె.దేవ కుమార్‌ను SP మెచ్చుకొని నగదు ప్రోత్సాహకాన్ని అందజేశారు.

News April 24, 2025

పాపన్నపేట: ఒంటిపై పెట్రోల్ పోసుకున్న యువకుడు మృతి

image

ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్న యువకుడు మృతి చెందాడు. పాపన్నపేట ఏఎస్ఐ సంగన్న కథనం ప్రకారం.. కొడుపాకకు చెందిన అవుసుల శ్రీకాంత్ (24) స్వర్ణకారుడుగా పనిచేస్తున్నాడు. ఈనెల 21న రాత్రి ఇంట్లో భార్య, తల్లికి మధ్య గొడవ జరిగింది. దీంతో మనస్తాపం చెంది శ్రీకాంత్ పెట్రోల్‌ను ఒంటిపై పోసుకొని నిప్పంటించుకున్నాడు. చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడని మృతుడి భార్య లావణ్య ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు.

error: Content is protected !!