News April 6, 2025

అన్నమయ్య జిల్లాలో వ్యక్తిపై పోక్సో కేసు నమోదు

image

మైనర్ బాలికను మోసంచేసి పిల్లలు కలిగేలా చేసిన వ్యక్తిపై పోక్సో కేసు నమోదు చేసినట్లు బీ కొత్తకోట సీఐ జీవన్ గంగానాథ బాబు తెలిపారు. మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలికను అదే గ్రామంలోని వ్యక్తి మాయమాటలతో లొంగదీసుకుని గర్భం దాల్చేలా చేసినట్లు చెప్పారు. అనంతరం ఆమెను తీసుకెళ్లి కర్ణాటకలో అబార్షన్ చేయించడానికి ప్రయత్నించడంతో అక్కడి పోలీసులు ఇచ్చిన సమాచారంతో పోక్సో కేసు నమోదు చేశామన్నారు.

Similar News

News April 9, 2025

దిల్‌సుఖ్‌నగర్‌లో బాంబ్ బ్లాస్ట్‌కు వేరే దగ్గర ప్లాన్

image

దిల్‌సుఖ్‌నగర్ బాంబ్ బ్లాస్ట్ రాష్ట్రాన్ని వణికించిన విషయం తెలిసిందే. అయితే ఉగ్రవాదులు ముందుగా స్థానికంగా మిర్చి సెంటర్, మద్యం దుకాణాన్ని టార్గెట్ చేయగా సమయం మించిపోతుండడంతో బాంబుతో సైకిల్‌ని వఖాస్ 107 బస్టాప్ వద్ద వదిలేసి వెళ్లాడు. దీనికి ముందు లుంబినీ పార్క్ వద్ద పేలిన బాంబ్‌ను కూడా హుస్సేన్ సాగర్‌లో షికారు బోటు వద్ద పెట్టాలని ప్లాన్ చేశారు. సమయం మించిపోవడంతో లేజేరియం వద్ద వదిలేసి వెళ్లాడు.

News April 9, 2025

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో BJP పాగా వేసేనా?

image

దేశంలో మూడోసారి అధికారంలోకి వచ్చిన బీజేపీ తెలంగాణపై గురి పెట్టింది. ఈ క్రమంలో ఇటీవల ఖమ్మం జిల్లా అధ్యక్షుడిగా నెల్లూరి కోటేశ్వరరావు, భద్రాద్రి జిల్లా అధ్యక్షుడిగా బైరెడ్డి ప్రభాకర్ రెడ్డిని నియమించింది. స్థానిక సంస్థలు, శాసనసభ ఎన్నికలే లక్ష్యంగా వారు దూకుడు పెంచారు. ఇటీవల ఎంపీ ఎన్నికల్లోనూ గతంలో కంటే మెరుగైన ఓట్ల శాతం రాబట్టింది. ఎంత వరకు విజయం వరిస్తుందో చూడాలి. దీనిపై మీ కామెంట్..

News April 9, 2025

భూపాలపల్లి: పెళ్లి కావట్లేదని యువకుడి సూసైడ్

image

పెళ్లి కావట్లేదని యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాలు.. చిట్యాల మండలం వెంచరామికి చెందిన లక్ష్మణ్(28) ట్రాక్టర్ డ్రైవర్‌గా చేస్తున్నాడు. తన అమ్మానాన్న చనిపోవడంతో చిన్నమ్మ వద్ద ఉంటున్నాడు. తన కంటే చిన్నవాళ్లకు పెళ్లవుతుందని మనస్తాపంతో పురుగుమందు తాగాడు. ఆసుపత్రికి తీసుకెళ్లగా.. చికిత్స పొందుతూ చనిపోయాడు. లక్ష్మణ్ చిన్నమ్మ కుమార్తె ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

error: Content is protected !!