News March 29, 2025
అన్నమయ్య: బాలుడిపై అఘాయిత్యం.. వ్యక్తి అరెస్ట్

అన్నమయ్య జిల్లాలో బాలుడిపై అఘాయిత్యానికి పాల్పడ్డ ఆటో డ్రైవర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. సంబేపల్లి ఎస్ఐ భక్తవత్సలం కథనం మేరకు.. మండలంలోని ఓ గ్రామానికి చెందిన 9ఏళ్ల బాలుడు ఈనెల 27సాయంత్రం ఇంటి వద్ద సైకిల్ తొక్కుతున్నాడు. అదే గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ రమేశ్ బాలుడికి మాయమాటలు చెప్పి ఆటోలో తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ కేసులో పోలీసులు నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.
Similar News
News April 2, 2025
జమ్మికుంట: భారీగా పెరిగిన పత్తి ధర

సుదీర్ఘ సెలవుల అనంతరం జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ ప్రారంభం కాగా.. పత్తి ధర భారీగా పెరిగింది. బుధవారం మార్కెట్‌కు 9 వాహనాల్లో రైతులు 109 క్వింటాల విడిపత్తి విక్రయానికి తీసుకురాగా..గరిష్ఠంగా రూ.7,380, కనిష్ఠంగా రూ.7,250 పలికింది. గోనెసంచుల్లో 13 క్వింటాళ్లు రాగా ₹5,300 నుంచి ₹5,500 వరకు వ్యాపారులు కొనుగోలు చేశారు. గతవారం కంటే తాజాగా పత్తిధర ₹150 పెరిగింది. ధరలు మరింత పెరగాలని రైతులు కోరుకుంటున్నారు.
News April 2, 2025
KMR: ‘పరీక్షల భయానికి తెర.. విద్యార్థుల్లో ఆనందం’

కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా గత కొన్ని రోజులుగా జరుగుతున్న పదో తరగతి పరీక్షలు నేటితో ప్రశాంతంగా ముగిశాయి. జిల్లాలోని అన్ని పరీక్షా కేంద్రాల్లో సాంఘిక పరీక్ష సజావుగా జరిగింది. దీంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. జిల్లా వ్యాప్తంగా చివరి పరీక్షకు 12,579 మంది విద్యార్థులకు 12,550 మంది హాజరు కాగా, 29 మంది గైర్హాజరైనట్లు జిల్లా విద్యాధికారి రాజు తెలిపారు.
News April 2, 2025
CM రేవంత్‌పై సుప్రీంకోర్టు ఆగ్రహం

TG: MLAల అనర్హత కేసు విచారణ సందర్భంగా CM రేవంత్‌పై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉపఎన్నికలు రావని అసెంబ్లీలో ప్రకటించడాన్ని ధర్మాసనం తప్పుబట్టింది. ‘ఉప ఎన్నికలు రావని అసెంబ్లీలో CM ప్రకటిస్తే అది రాజ్యాంగంలోని పదో షెడ్యూల్‌ను అపహాస్యం చేయడమే. అవసరమైతే దీనిని కోర్టు ధిక్కారంగా పరిగణిస్తాం. ఇలాంటి వ్యాఖ్యలు మరోసారి చేయొద్దని CMకు హితవు చెప్పాలి’ అని స్పీకర్ తరఫు న్యాయవాదిని ఆదేశించింది.