News April 8, 2025

అన్నమయ్య: రూ.50 పెంపు.. రూ.2.50కోట్ల భారం

image

అన్నమయ్య జిల్లాలోని పేద ప్రజలకు మరో షాక్ తగిలింది. గ్యాస్ సిలిండర్‌పై రూ.50 పెంచడంతో సామాన్యులపై మరింత భారం పడనుంది. జిల్లాలో 5లక్షలకు పైగా గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. గతంలో రూ.853గా ఉన్న సిలిండర్ రూ.903కు చేరడంతో జిల్లాలోని వినియోగదారులపై అదనంగా రూ.2.50కోట్లకు పైగా భారం పడనుంది. దీనిపై మీ కామెంట్.

Similar News

News April 17, 2025

అమెరికాలో చంద్రగిరి వాసికి మంత్రి పదవి

image

అగ్రరాజ్యం అమెరికాలో ఉమ్మడి చిత్తూరు జిల్లా వాసికి కీలక పదవి లభించింది. చంద్రగిరికి చెందిన టీడీపీ మహిళా నేత లంకెళ్ల లలిత, శ్రీరాముల కుమారుడు బద్రి 25 ఏళ్లుగా అమెరికాలో ఉంటున్నాడు. అక్కడి విస్కాన్ సిన్ స్టేట్‌లోని మాడిసన్ డిస్ట్రిక్ట్-7లో అల్డర్ పర్సన్‌గా 53.8 శాతం ఓట్లతో గెలిచారు. తాజాగా ఆయన నాలుగు శాఖల మంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు.

News April 17, 2025

పల్నాడు: 2 నెలల్లో రిటైర్‌మెంట్.. గుండెపోటుతో టీచర్ మృతి

image

పిడుగురాళ్ల (M) బ్రాహ్మణపల్లి ZP స్కూల్ ఇంగ్లిష్ టీచర్ వెంకటరెడ్డి గుంటూరు DEO ఆఫీస్ వద్ద గుండెపోటుతో కుప్పకూలిపోయారు. DEO సి.వి రేణుక సత్వరమే స్పందించడంతో ఉర్దూ DI ఖాశీం, DEO ఆఫీస్ సిబ్బంది హాస్పిటల్‌కి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్థారించారు. తూర్పు MEO ఖుద్దూస్, APTF అధ్యక్షుడు బసవలింగారావు వెంకటరెడ్డికి నివాళులర్పించారు. ఈయన 2 నెలల్లో రిటైర్ కానున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు.

News April 17, 2025

జంగారెడ్డిగూడెం: ఇంటర్ విద్యార్థిని సూసైడ్

image

జంగారెడ్డిగూడెంలో బుధవారం విషాద ఘటన జరిగింది. తల్లిదండ్రులు వేరుగా ఉంటున్నారని అల్లు అలేఖ్య (16) అనే బాలిక ఉరేసుకొని మృతి చెందింది. ఈ ఘటనపై ఎస్ఐ జబీర్ వివరాల ప్రకారం.. రవి- నాగ దుర్గాదేవి దంపతులు. వీరి మధ్య ఏర్పడిన విభేదాలతో విడిగా ఉంటున్నారు. కుమార్తె అలేఖ్య అమ్మమ్మ ఇంటి వద్ద ఇంటర్ చదువుతోంది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుందని, తన మృతితోనైనా తల్లిదండ్రులు కలిసి ఉండాలని లేఖ రాసిందన్నారు. 

error: Content is protected !!