News August 8, 2024

అన్ని గ్రామాల్లో ఫీవర్ సర్వే చేపట్టాలి: జిల్లా కలెక్టర్

image

స్వచ్ఛదనం- పచ్చదనం కార్యక్రమంలో భాగంగా బుధవారం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ జిల్లా అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. మొదటి రెండు రోజులు జిల్లా అధికారులందరూ ఉత్సాహంగా కార్యక్రమంలో పాల్గొన్నారని కలెక్టర్ అన్నారు. రెండు రోజులు కూడా పూర్తి శ్రద్ధతో కార్యక్రమాల్లో పాల్గొనాలని, ఇవాళ జిల్లాలోని అన్ని మండలాల్లో, అన్ని గ్రామాలలో ఫీవర్ సర్వే చేపట్టాలని పేర్కొన్నారు.

Similar News

News October 8, 2024

చెన్నారంలో శిశువు మృతదేహం కలకలం

image

ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలంలోని చెన్నారం గ్రామంలో శిశువు మృతదేహం కలకలం రేపింది. గ్రామంలో ఓ వ్యక్తి ఇంటి ఎదుట మంగళవారం తెల్లవారుజామున శిశువు మృతదేహం పడేసి ఉంది. ఈ ఘటన గ్రామంలో చర్చనీయంగా మారింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరించారు. మృతదేహన్ని ఎవరైనా తీసుకొచ్చి పడేశారా లేదా కుక్కలు లాక్కొచ్చాయా అనే కోణంలో విచారిస్తున్నారు.

News October 8, 2024

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

image

∆} ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మంత్రి పొంగులేటి పర్యటన
∆} ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా బతుకమ్మ వేడుకలు
∆} పలు శాఖల అధికారులతో ఖమ్మం& భద్రాద్రి జిల్లా కలెక్టర్లు సమీక్ష సమావేశం
∆} ఖమ్మం నగరంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పర్యాటన
∆} సత్తుపల్లిలో ఎమ్మెల్యే రాగమయి దయానంద్ పర్యటన
∆} పాల్వంచ పెద్దమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు
∆} కొత్తగూడెం పట్టణంలో విద్యుత్ సరఫరాల అంతరాయం

News October 8, 2024

ప్రతి ధాన్యం గింజను కొనుగోలు చేస్తాం: జిల్లా కలెక్టర్

image

ఖరీఫ్ 2024-25 సీజన్లో ఖమ్మం జిల్లాలో సన్న రకం ధాన్యం కొనుగోలుకు ప్రత్యేకంగా కేంద్రాలు ఏర్పాటు చేశామని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. సోమవారం భక్త రామదాసు కళాక్షేత్రంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు సన్నాహక సమావేశంలో జిల్లా కలెక్టర్ అదనపు కలెక్టర్ శ్రీజ, శిక్షణ కలెక్టర్ మృణాల్ శ్రేష్ఠతో కలిసి పాల్గొన్నారు. ఈ సీజన్లో ప్రతి ధాన్యం గింజను కొనుగోలు చేస్తామని వెల్లడించారు.