News March 22, 2024

అప్పుడు గల్లా.. ఇప్పుడు పెమ్మసాని

image

టీడీపీ గుంటూరు ఎంపీ అభ్యర్థిగా డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్‌ పేరు ఖరారైంది. 2014, 2019లో గుంటూరు ఎంపీగా గెలిచిన గల్లా జయదేవ్ అనూహ్యంగా రాజకీయాలకు విరామం ప్రకటించారు. ఈ నేపథ్యంలో బలమైన అభ్యర్థి కోసం టీడీపీ అన్వేషించింది. ఇదే సమయంలో సేవా కార్యక్రమాలతో పేరు పొందిన పెమ్మసాని తెరపైకి వచ్చారు. దీంతో ఆయనకే చంద్రబాబు అవకాశం ఇచ్చారు. వైసీపీ అభ్యర్థిగా పొన్నూరు ఎమ్మెల్యే కిలారి రోశయ్య పోటీ చేయనున్నారు.

Similar News

News April 3, 2025

ఉదయం 8 తర్వాత హెవీ వెహికల్స్‌కు ప్రవేశం లేదు: ట్రాఫిక్ డీఎస్పీ

image

ఉదయం 8 గంటల నుంచి రాత్రి పది గంటల వరకు హెవీ వెహికల్స్ గుంటూరులోకి ప్రవేశించడానికి అనుమతి లేదని ట్రాఫిక్ డీఎస్పీ రమేశ్ స్పష్టం చేశారు. బుధవారం డీఎస్పీ తన కార్యాలయంలో నగరంలోని హెవీ వెహికల్స్ యూనియన్ నాయకులతో సమావేశం నిర్వహించారు. రాత్రి 10:00 నుంచి ఉదయం 8 గంటల లోపు మాత్రమే హెవీ వెహికల్స్ నగరంలోకి ప్రవేశం ఉందన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటామన్నారు. సీఐ సింగయ్య పాల్గొన్నారు.

News April 3, 2025

వసతీ గృహాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి: కలెక్టర్

image

ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలు, వసతీ గృహాల్లో బాల, బాలికలు, మహిళల పై నేరాల నియంత్రణ కోసం ముందస్తుగా భద్రతా చర్యలు చేపట్టాలని గుంటూరు కలెక్టర్ నాగలక్ష్మీ సూచించారు. కలెక్టరేట్ కార్యాలయంలోని డీఆర్సీ మీటింగ్ హాలులో బుధవారం ఎస్పీ సతీశ్ కుమార్‌తో కలిసి నేరాల నియంత్రణ పై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. వసతీ గృహాల స్వాగత ద్వారంలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఆదేశించారు.

News April 2, 2025

బస్సుల అనుమతులకు రిమార్కులు అందించండి- కలెక్టర్

image

రవాణా శాఖ అధికారులతో గుంటూరు కలెక్టర్ కార్యాలయంలో బుధవారం సమావేశం నిర్వహించారు. గుంటూరులో ప్రైవేటు సిటీ బస్సుల రూట్ల అనుమతులకు సంబంధించి సమావేశం నిర్వహించినట్లు కలెక్టర్ నాగలక్ష్మి తెలిపారు. కలెక్టర్, ఎస్పీ సతీష్ కుమార్ మాట్లాడుతూ.. సిటీ బస్సుల అనుమతులకు సంబంధించి ఆర్టీసీ అధికారులు ఏప్రిల్ 9 నాటికి రిమార్కులు అందించాలని ఆదేశించారు. అనంతరం అనుమతుల మంజూరుకు ఆర్‌టీ‌ఏ కమిటీ చర్యలు తీసుకుంటుందన్నారు.

error: Content is protected !!