News November 13, 2024
అభివృద్ధి పేరుతో అమాయకుల భూములు లాక్కోవద్దు: డీకే అరుణ
అభివృద్ధి పేరుతో అమాయకుల భూములు లాక్కోవడం ఆపివేయాలని మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ అన్నారు. రైతులను పరామర్శించడానికి వెళ్తున్న ఎంపీని పోలీసులు మన్నెగూడ వద్ద అడ్డుకున్నారు. దీంతో ఆమె నిరసన వ్యక్తం చేసిన అనంతరం మీడియాతో మాట్లాడారు. సీఎం సొంత నియోజకవర్గంలో శాంతిభద్రతల సమస్య నెలకొనడం ప్రభుత్వ వైఫల్యమేనని ఆమె మండిపడ్డారు. అధికారం ఉందని అహంకారంతో ఏది పడితే అది చేయొద్దని సూచించారు.
Similar News
News November 23, 2024
NGKL: దారుణం.. భర్తను హత్య చేసిన భార్య, కూతురు
NGKL జిల్లా తెలకపల్లి మండలంలో శుక్రవారం అర్ధరాత్రి దారుణ హత్య జరిగింది. పోలీసుల వివరాలు.. వట్టిపల్లికి చెందిన ఈశ్వరయ్యను భూమి అమ్మకం విషయమై తన భార్య ఎల్లమ్మ, బావమరిది బాలస్వామి, పెద్దకూతురు స్వాతి, పెద్దఅల్లుడు మల్లేశ్, మరదలు ఆశమ్మలు హత్య చేశారు. గొడ్డలితో దాడిచేసి, మర్మాంగాన్ని కత్తిరించి హతమార్చారు. మృతుడి చెల్లెలు నిర్మల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు CI కనకయ్య గౌడ్ తెలిపారు.
News November 23, 2024
కొల్లాపూర్: ఈనెల 27న హీరో విజయ్ రాక..
ఈనెల 27, 28, 29న కొల్లాపూర్ నియోజకవర్గ కేంద్రంలో ఆర్‌ఐడీ పూర్వ విద్యార్థుల స్వర్ణోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈనెల 27న ప్రారంభమయ్యే స్వర్ణోత్సవాలను సినిమా హీరో విజయ్ దేవరకొండ ప్రారంభించనున్నారు. అలాగే చివరి రోజు 29న కొల్లాపూర్ పట్టణంలోని రామాపురం రహదారిలో మ్యూజిక్ డైరెక్టర్ తమన్ మ్యూజిక్ ప్రోగ్రాం నిర్వహించనున్నారు. మూడు రోజుల పాటు ఆర్టిస్టులతో కొల్లాపూర్ బిజీబిజీగా కళకళలాడనుంది.
News November 23, 2024
MBNR:చలి పంజా.. వణుకుతున్న ప్రజలు
ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా తెల్లవారు జాము నుంచే దట్టమైన పొగ మంచుతో చలి గాలుల తీవ్రత పెరుగుతున్నది. దీంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షాలు భారీగా కురవడంతో చెరువులన్నీ నీటితో నిండాయి. ఫలితంగా చెరువుల మీదుగా చలి గాలులు ఎక్కువగా వీస్తున్నాయి. చలిగాలుల తీవ్రత పెరుగుతున్నందున వృద్ధులు, చిన్నపిల్లలు అప్రమత్తంగా ఉండాలని, స్వెటర్లు, చేతులకు గ్లౌజులు ధరిస్తే ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు.