News February 28, 2025

అభివృద్ధి, సంక్షేమానికి సమ ప్రాధాన్యం: నక్కా ఆనందబాబు

image

రాష్ట్ర బడ్జెట్లో అభివృద్ధి, సంక్షేమానికి సమ ప్రాధాన్యత కల్పించారని మాజీ మంత్రి, వేమూరు శాసన సభ్యులు నక్కా ఆనందబాబు అన్నారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. ఆదాయం, అప్పులు బేరీజు వేసుకుంటూ ప్రాధాన్యత క్రమంలో పథకాల అమలుకు కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు. విద్యార్థుల చదువులకు ఆర్థిక భరోసా కల్పిస్తూ తల్లికి వందనం పథకం అమలుకు బడ్జెట్లో రూ.9,407 కోట్లు నిధులు కేటాయించడం శుభ పరిణామం అన్నారు.

Similar News

News March 1, 2025

ఇంకా నయం జెలెన్‌స్కీని ట్రంప్ కొట్టలేదు: రష్యా

image

ట్రంప్, జెలె‌న్‌స్కీ వాగ్వాదంపై రష్యా స్పందించింది. ఇంతటి గొడవలో జెలెన్‌స్కీని ‘కొట్టకుండా’ ట్రంప్ చాలా సంయమనం పాటించారని ఆ దేశ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మరియా జఖరోవా అన్నారు. మీటింగ్‌లో ఆయన అన్నీ అబద్ధాలే మాట్లాడారని ఆరోపించారు. ఇక వైట్‌హౌస్‌లో జరిగిన ఘటన జెలెన్‌‌స్కీకి చెంపదెబ్బ లాంటిదని రష్యా మాజీ అధ్యక్షుడు మెద్వెదేవ్ పేర్కొన్నారు. ఆయనను ‘అవమానం జరిగిన పంది’గా అభివర్ణించారు.

News March 1, 2025

నిర్మల్: వృత్తి నైపుణ్యాన్ని అలవర్చుకోవాలి: డీఈవో

image

నూతన ఉపాధ్యాయులు వృత్తి నైపుణ్యాన్ని అలవర్చుకోవాలని జిల్లా విద్యాధికారి రామారావు అన్నారు. శుక్రవారం 2024 ఎస్‌జీటీ ఉపాధ్యాయులకు మూడు రోజుల శిక్షణ తరగతులను పంచ సీల్ కళాశాలలో నిర్వహించారు. కొత్తగా నియమితులైన ఉపాధ్యాయులందరూ తమ సర్వీసులో విద్యార్థులకు ఏ విధంగా క్రమశిక్షణతో వెలిగి పురోగతి సాధించాలో శిక్షణ అందించారు. ఎంఈఓ నర్సయ్య, విజయ్ కుమార్, అశోక్ వర్మ తదితరులు పాల్గొన్నారు.

News March 1, 2025

NZB: ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్‌లో జిల్లా క్రీడాకారులు

image

ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ హాకీ టోర్నీలో జిల్లాకు చెందిన ఇద్దరు క్రీడాకారులు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఏపీలోని కాకినాడలో జరుగుతున్న ఈ టోర్నమెంట్‌లో జిల్లాకు చెందిన జి. సుమన్, ఆర్.శివకుమార్ రీజినల్ స్పోర్ట్స్ బోర్డ్ హైదరాబాద్ జట్టు తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే సుమన్ హైదరాబాదులోని ఏజీ ఆఫీస్‌లో సీనియర్ ఆడిటర్‌గా, శివకుమార్ స్థానిక ఇన్కమ్ టాక్స్ ఆఫీస్‌లో ఓఎస్‌గా పనిచేస్తున్నారు.

error: Content is protected !!