News February 2, 2025
అభివృద్ధిని చూసి ప్రతిపక్షం ఓర్వలేక పోతుంది: పొంగులేటి
ప్రజా ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి ప్రతిపక్షం ఓర్వలేక పోతుందని రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన సత్తుపల్లిలో ఆకస్మికంగా పర్యటించారు. ఈ సందర్భంగా టీజీఐడీసీ ఛైర్మన్ మువ్వా విజయబాబు, కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు డాక్టర్ మట్టా దయానంద్ తో కలిసి కార్యకర్తలతో మాట్లాడారు. అనంతరం పలు బాధిత కుటుంబాలను పరామర్శించి, భరోసానిచ్చారు.
Similar News
News February 3, 2025
రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలకు ఖమ్మం జట్టు సిద్ధం
రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీల్లో పాల్గొనేందుకు ఖమ్మం జిల్లా టీం ఎంపికైందని కోచ్ వీరరాఘవయ్య తెలిపారు. కల్లూరు మినీ స్టేడియంలో జరిగిన శిబిరంలో టీం ఎంపికైందని చెప్పారు. శిబిరంలో ప్రతిభ కనబరిచిన 12 మంది క్రీడాకారులను కబడ్డీ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు దయాకర్ రెడ్డి, కార్యదర్శి కటికల క్రిస్టోఫర్ బాబు ఆధ్వర్యంలో ఎన్నుకున్నారు.. వీరు ఆదిలాబాద్‌లో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని పేర్కొన్నారు.
News February 2, 2025
KMM: రేపటి నుంచే ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్లు
NLG – KMM – WGL టీచర్ MLC స్థానానికి అభ్యర్థుల నుంచి సోమవారం నామినేషన్లు స్వీకరించనున్నారు. NLG కలెక్టరేట్లో అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాలను కలెక్టర్ ఇలా త్రిపాఠికి అందజేయనున్నారు. ఈ నెల 10 వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. ఈ నెల 27న ఉ. 8 నుంచి సా. 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. మార్చి 3న ఆర్జాలబావి వద్ద ఉన్నవేర్ హౌసింగ్ గోదాములో ఓట్ల లెక్కింపు చేపట్టనుండగా, అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.
News February 2, 2025
ఖమ్మం: యువకుడిపై పోక్సో కేసు నమోదు: సీఐ రమేశ్
ప్రేమించాలని బాలికను వేధిస్తున్న యువకుడిపై పోక్సో కేసు నమోదు చేసినట్లు ఖమ్మం త్రీటౌన్ సీఐ రమేశ్ తెలిపారు. ప్రకాష్ నగర్‌కు చెందిన శ్రావణ్ కుమార్ అదే ప్రాంతానికి చెందిన బాలికను కొన్నాళ్లుగా వేధిస్తున్నాడు. ఆమె చదువుతున్న పాఠశాలకు సైతం వెళ్లి బెదిరిస్తుండటంతో బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.