News April 17, 2024
అభ్యర్థుల ఖర్చులను పక్కాగా నమోదు చేయాలి:కలెక్టర్
నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైన రోజు నుంచే అభ్యర్ధుల ఖాతాలో ఖర్చు లెక్కించేందుకు సిద్ధం కావాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ మనజీర్ జిలానీ సమూన్ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ అధికారులతో సమావేశం నిర్వహించారు. అభ్యర్థి నామినేషన్ వేసిన దగ్గరనుంచీ అతని ఖాతాలో పక్కాగా ఖర్చు నమోదు చేయాలన్నారు.
Similar News
News February 1, 2025
పోలీసు శాఖ ఎప్పుడూ అండగా ఉంటుంది: SKLM ఎస్పీ
సుదీర్ఘకాలంగా పోలీసు శాఖకు అందించిన సేవలు చిరస్మరణీయమని జిల్లా ఎస్పీ మహేశ్వర రెడ్డి కొనియాడారు. జిల్లా ఆర్మ్డ్ రిజర్వ్ విభాగంలో విధులు నిర్వహిస్తూ పదవీ విరమణ పొందిన అసిస్టెంట్ రిజర్వ్ ఎస్ఐ చిన్నారావు, హెడ్ కానిస్టేబుల్ రాఘవరావులను శనివారం ఆయన ఘనంగా సన్మానించారు. వారికి పోలీసు శాఖ ఎప్పుడూ అండగా ఉంటుందన్నారు.
News February 1, 2025
SKLM: రథసప్తమి ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్
రథసప్తమి ఏర్పాట్లను SKLM జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ శనివారం పరిశీలించారు. సూర్య నమస్కారాలు నిర్వహించబోయే 80 అడుగుల రోడ్డు వద్ద ఏర్పాట్లు, అక్కడే పార్కింగ్ ఏర్పాట్లు పై జేసీ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, డీఎస్పీ వివేకానందతో చర్చించారు. పలు సూచనలు జారీ చేశారు. నగరంలో మిల్లు జంక్షన్, పాలకొండ రోడ్డులో జరుగుతున్న బ్యూటిఫికేషన్ పనులను పరిశీలించారు.
News February 1, 2025
శ్రీకాకుళం: హాస్టల్ వార్డెన్ సస్పెన్షన్
శ్రీకాకుళం మహిళా కళాశాల ప్రాంగణంలోని ప్రభుత్వ బాలికల కళాశాల వసతి గృహం-3 వార్డెన్ ఎం.పూర్ణను సస్పెండ్ చేస్తూ కలెక్టర్ స్వప్నికల్ దినకర్ పుండ్కర్ శుక్రవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు. గురువారం రాత్రి హాస్టల్ విద్యార్థినిపై జరిగిన దాడి నేపథ్యంలో కలెక్టర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. హాస్టల్ విద్యార్థినిపై వ్యక్తులు దాడి చేసిన విషయం సంచలనం కావడంతో యుద్ధప్రాతిపదికన కలెక్టర్ చర్యలు తీసుకున్నారు.