News September 1, 2024

అమరావతి: వరద పరిస్థితిపై మంత్రి అనిత సమీక్ష

image

రాష్ట్రంలో వరద పరిస్థితిపై హోంమంత్రి వంగలపూడి అనిత సమీక్షించారు. తాడేపల్లిలోని విపత్తుల నిర్వహణ సంస్థ కార్యలయంలోని స్టేట్ ఎమర్జన్సీ ఆపరేషన్ సెంటర్ నుంచి ఆదివారం ప్రస్తుత వరద పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ముంపు బారిన పడిన 294 గ్రామలకు చెందిన 13,227 మందిని పునరావాస కేంద్రాలకు తరలించినట్లు మంత్రి తెలిపారు.

Similar News

News September 29, 2024

పెనుమూడి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి

image

రేపల్లె మండలం పెనుముడి వారధి వద్ద ఆదివారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రేపల్లె నుంచి మచిలీపట్నం వెళుతున్న ఆర్టీసీ బస్సును అవనిగడ్డ వైపు నుంచి వస్తున్న అశోక్ లేలాండ్ వెహికల్‌ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో అశోక్ లేలాండ్ లో ఉన్న పదిమందిలో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. పలువురికి గాయాలుకాగా క్షతగాత్రులను రేపల్లె సీఐ మల్లికార్జునరావు ఆసుపత్రికి తరలించారు.

News September 29, 2024

రౌడీ షీటర్లు మంచి మార్గంలో జీవించండి: ఎస్పీ సతీశ్

image

గుంటూరు నగరంలోని రౌడీషీటర్లకు ఆదివారం పోలీస్ కార్యాలయంలో ఎస్పీ సతీశ్ కుమార్ కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. రౌడీషీటర్లు చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఇప్పటి నుంచి పద్ధతి మార్చుకొని మంచి మార్గంలో కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా జీవించాలని సూచించారు. రౌడీ షీటర్లపై నిరంతరం నిఘా కొనసాగుతుందని చెప్పారు.

News September 29, 2024

అమరావతి: సీఎం రిలీఫ్ ఫండ్‌కు రూ.లక్ష విరాళం

image

క్రైస్తవ మిషనరీల ఆధ్వర్యంలో సీఎం రిలీఫ్ ఫండ్‌కు ఆదివారం రూ.లక్ష చెక్కును సీఎం చంద్రబాబుకు అందించారు. వరద బాధితులకు తక్షణ సాయంగా చంద్రబాబు సీఎం రిలీఫ్ ఫండ్ అందిస్తూ ఎంతగానో బాధితులను ఆదుకున్నారని క్రైస్తవ మిషనరీ సంఘం వారు ఆన్నారు. సీఎం చంద్రబాబు పిలుపు మేరకు క్రైస్తవ మిషనరీల ఆధ్వర్యంలో సహాయం అందించడం జరిగిందని మిషనరీ బిషప్ అన్నారు.