News April 4, 2025
అమరావతికి మోదీ రాక.. ఏర్పాట్లు షురూ

అమరావతి రాజధాని ప్రాంతానికి PM మోదీ ఈనెలలో రానున్నారు. ఈ నేపథ్యంలో గుంటూరు SP సతీశ్ గురువారం వెలగపూడి సచివాలయం సమీపంలో హెలిప్యాడ్లు ఏర్పాటు చేసే ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ మేరకు స్థానిక అధికారులకు పలు సూచనలు చేశారు. కాగా మోదీ రాక కోసం మూడు హెలిప్యాడ్లు ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. కార్యక్రమంలో తుళ్లూరు DSP మురళీకృష్ణ, MRO సుజాత, సీఐలు శ్రీనివాసరావు, కోటేశ్వరరావు పాల్గొన్నారు.
Similar News
News April 11, 2025
గుంటూరు: హైదరాబాద్కు 4లైన్ నేషనల్ హైవే

ఆంధ్రప్రదేశ్లో కీలకమైన నేషనల్ హైవేల పనులు వేగవంతమయ్యాయి. పల్నాడు జిల్లా నుంచి గుంటూరు జిల్లా మీదుగా బాపట్ల జిల్లాకు వాడరేవు నుంచి పిడుగురాళ్ల వరకు 167ఏ జాతీయ రహదారి రూ.1,064.24 కోట్లతో నిర్మాణం జరుగుతోంది. ఈ ఏడాది ఆఖరికి హైవే పూర్తవుతుందని భావిస్తున్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలను కలుపుతూ 4లైన్ల హైవేను హైదరాబాద్కు నిర్మించే పనులను ప్రభుత్వం వేగవంతం చేస్తున్నట్టు సమాచారం.
News April 11, 2025
మంగళగిరిలో అభివృద్ధి పరంపరకు కొనసాగింపు

మంగళగిరిలో అభివృద్ధి పరంపరకు కొనసాగింపుగా, 1986లో ఎన్టీఆర్ శంకుస్థాపన చేసి పూర్తిచేసిన ప్రభుత్వ హాస్పిటల్కి, నేడు మంత్రి లోకేశ్ మరో మెరుగైన రూపాన్ని అందిస్తున్నారు. మంగళగిరిలో 100 పడకల ఆసుపత్రికి శంకుస్థాపన చేసిన లోకేశ్, ఈ ఆసుపత్రిని ఒక ఏడాది వ్యవధిలో పూర్తిచేయనున్నట్లు వెల్లడించారు. టీడీపీతోనే అభివృద్ధి, సంక్షేమం సాధ్యం అన్న విషయాన్ని ఈ ఉదాహరణ బలంగా చాటుతుందని టీడీపీ శ్రేణులు అంటున్నాయి.
News April 11, 2025
రేపే ఇంటర్ ఫలితాలు.. జిల్లా విద్యార్థుల ఎదురుచూపు

రేపు ఇంటర్ ఫలితాలు విడుదల కానున్న నేపథ్యంలో విద్యార్థులు ఉత్కంఠలో ఉన్నారు. తొలిసారి ఇంటర్ పరీక్షలు రాసిన ఫస్ట్ ఇయర్ విద్యార్థులు కంటే ఎక్కువగా, భవిష్యత్ లక్ష్యాలపై ఆశలు పెట్టుకున్న సెకండ్ ఇయర్ విద్యార్థుల్లో ఉద్విగ్నత కనిపిస్తోంది. గుంటూరు జిల్లాలోనే 1వ సంవత్సరం 35,688, 2వ సంవత్సరం 35,946మంది మొత్తం 71,634 మందికిపైగా విద్యార్థులు పరీక్షలు రాశారు. ఫలితాల కోసం Way2News ఫాలో అవ్వండి.