News March 21, 2024

అమలాపురం MP చింతా అనురాధ పార్టీ మార్పు.. క్లారిటీ

image

తాను వైసీపీ నుంచి వేరే పార్టీలోకి మారుతున్నట్లు ప్రచారం సాగుతుందని ఇది పూర్తిగా అవాస్తవం అని అమలాపురం MP చింతా అనురాధ అన్నారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. తాను పార్లమెంట్ సభ్యురాలిగా ఎన్నికైన సందర్భంలో సీఎం జగన్ చేసిన సాయం మరువలేనిదన్నారు. అటువంటి వ్యక్తి నీడలోనే పని చేస్తాను తప్ప మరో గూటికి చేరే వ్యక్తిని కాను అని స్పష్టం చేశారు.

Similar News

News April 14, 2025

విజ్జేశ్వరం: గోదావరిలో స్నానానికి దిగి ఇద్దరు గల్లంతు

image

సీతంపేట సమీపంలోని విజ్జేశ్వరం – మద్దూరు లంక బ్యారేజ్ దగ్గర సోమవారం సాయంత్రం గోదావరి నదిలో స్నానానికి దిగి ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. నిడదవోలుకు చెందిన మత్తి ప్రకాష్ కుమార్ (15), రాజమండ్రికి చెందిన గంధం హర్ష (20) నదిలో గల్లంతయ్యారని విషయం తెలుసుకొని ఎన్డీఆర్‌ఎఫ్, గజ ఈతగాళ్లు రంగంలోకి దిగి గాలింపు చర్యలు చేపట్టారు. మంత్రి కందుల దుర్గేష్, కలెక్టర్,ఎస్పీలతో మాట్లాడి గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.

News April 14, 2025

కోరుకొండ కొండపై నుంచి రోప్‌వేకి కేంద్రం గ్రీన్ సిగ్నల్

image

కేంద్ర ప్రభుత్వం ఏపీలో ఐదు ప్రాంతాల్లో రోప్‌వేలకు అనుమతి ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్‌ను పర్యాటకంగా అభివృద్ధి చేసే వాటిలో కోరుకొండలోని లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ఉన్నట్లు ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ తెలిపారు. లక్ష్మీనరసింహస్వామి ఆలయం ముందు నుంచి శిఖరాగ్రం వరకూ 0.25 కిలోమీటర్లు రోప్‌వే ఏర్పాటు చేయాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోందని పేర్కొన్నారు. కేంద్రం నుంచి అనుమతి రావడం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.

News April 14, 2025

రాజమండ్రి: ప్రజలకు ఎస్పీ సూచనలు

image

భారత రాజ్యాంగ నిర్మాత, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి అలుపెరుగని కృషిచేసిన భారతరత్న డా. బి.ఆర్. అంబేద్కర్ గారి 134వ జయంతి సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ డి. నరసింహ కిషోర్ ముందస్తు శుభాకాంక్షలు తెలిపారు. రేపు అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని జిల్లాలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా ప్రజలు జయంతి పండగ ఉత్సవాలను జరుపుకోవాలని జిల్లా ఎస్పీ సూచించారు.

error: Content is protected !!