News March 18, 2025
అమలాపురం: ‘డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలి’

మెగా డీఎస్సీ పేపర్లకే పరిమితమైందని ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి ఉమేశ్ అన్నారు. ఆరు నెలలకు గడుస్తున్నా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలేదన్నారు. నిరుద్యోగ భృతి రూ. 3000 వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు జిల్లా రెవెన్యూ అధికారి రాకుమారికి వినతి పత్రం అందించారు. ఆయన మాట్లాడుతూ.. వేలాదిమంది నిరుద్యోగ యువత ఉద్యోగాల నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తున్నారు అన్నారు.
Similar News
News March 19, 2025
వికారాబాద్: బీజేపీలో అంతర్గత కుమ్ములాట

ఊహించని విధంగా వికారాబాద్ జిల్లా బీజేపీ అధ్యక్షునిగా స్థానికేతరుడైన డాక్టర్ కొప్పుల రాజశేఖర్ రెడ్డిని నియమించడంతో వికారాబాద్ జిల్లా బీజేపీ సీనియర్ నాయకులు ఆగ్రహంగా ఉన్నారు. నామినేషన్ తిరస్కరించాలని సంబంధిత పరిశీలకునికి వినతి పత్రం సమర్పించిన రోజే జిల్లా అధ్యక్షునిగా డాక్టర్ రాజశేఖర్ రెడ్డిని నియమించడం పట్ల వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నేడు హైదరాబాద్‌కు వెళ్లనున్నారు.
News March 19, 2025
సెగలుకక్కుతున్న వనపర్తి

వనపర్తి జిల్లాలో 20 ఉష్ణోగ్రత నమోదు కేంద్రాల్లో గడచిన 24 గంటల్లో నమోదైన ఉష్ణోగ్రత వివరాలు ఇలా ఉన్నాయి. అత్యధికంగా పెబ్బేరులో 39.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. కేతపల్లి 39.8, పెద్దమందడి 39.7, వీపనగండ్ల 39.6, గోపాల్ పేట 39.6, రేమద్దుల 39.6, విలియంకొండ 39.5, కానాయిపల్లి 39.5, జానంపేట 39.5, వెలుగొండ 39.5, దగడ 39.4, వనపర్తి 39.4, మదనపురం 39.3, పానగల్ 39.3 డిగ్రీలుగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
News March 19, 2025
VKB: పరీక్షల నిర్వహణకు అధికారుల నియామకం

వికారాబాద్ జిల్లాలో 10వ తరగతి పరీక్ష కేంద్రాల నిర్వహణ పరిశీలన కోసం పలు అధికారులను నియమించారు. అందులో 20 మంది MROలు, 20 మంది MPDOలు, 20 మంది MEOలు, 69 మంది చీఫ్ సూపరింటెండెంట్, 69 మంది డిపార్ట్మెంటల్ ఆఫీసర్స్, 8మంది పోలీస్ స్టేషన్ కస్టోడియన్స్, 13మంది రూట్ ఆఫీసర్స్, 69మంది సెట్టింగ్స్ స్వీట్స్, 10మంది ఫ్లైయింగ్ స్పాట్స్, 732మంది ఇన్విజిలేటర్లను ఏర్పాటు చేశారు.