News March 23, 2025

అమలాపురం నుంచి భద్రాచలానికి ప్రత్యేక బస్సులు

image

ఏప్రిల్ 6న శ్రీరామ నవమి సందర్భంగా భద్రాచలంలో సీతారామ కళ్యాణం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా అమలాపురం డిపో నుంచి ఏప్రిల్ 5న ఉదయం 8:30 నుంచి రాత్రి 8:30 గంటల వరకు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయనున్నట్లు డిపో మేనేజర్ సత్యనారాయణ మూర్తి ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. కళ్యాణం పూర్తయిన తర్వాత భద్రాచలం నుంచి అమలాపురం రావడానికి మధ్యాహ్నం1:30 నుంచి రాత్రి 7 గంటల వరకు బస్సులు నడుపుతామన్నారు.

Similar News

News March 29, 2025

LRS రాయితీ గడువు పెంచే అవకాశం?

image

TG: లే అవుట్ క్రమబద్ధీకరణ పథకం (LRS) రుసుములో ప్రభుత్వం ఇచ్చిన 25% రాయితీ గడువు ఈనెల 31తో ముగియనుంది. అయితే ఈ గడువును పొడిగించాలని దరఖాస్తుదారులు కోరుతున్నారు. ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లోనూ పలువురు ఎమ్మెల్యేలు రాయితీ గడువును పొడిగించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ నేపథ్యంలో ఏప్రిల్ నెలాఖరు వరకు గడువును పొడిగించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం. దీనిపై సర్కార్ నుంచి స్పష్టత రావాల్సి ఉంది.

News March 29, 2025

నిమ్స్‌లో ఉచితంగా పీడియాట్రిక్ గుండె శస్త్ర చికిత్సలు

image

HYD నిమ్స్ ఆస్పత్రిలో నూతనంగా ఏర్పాటు చేసిన పీడియాట్రిక్ కార్డియాక్ కేర్ సెంటర్‌లో ఉచితంగా గుండె శస్త్ర చికిత్సలు చేస్తున్నట్లు ఆస్పత్రి వైద్యులు అమరేష్ రావు తెలిపారు. తెలంగాణకు చెందిన చిన్నారులతోపాటు ఇక్కడ సెటిల్ అయిన TG, AP ఆధార్ కార్డు ఉన్న కుటుంబాల చిన్నారులకు గుండె సమస్యలు ఉన్నట్లయితే ఉచితంగా శస్త్ర చికిత్సలు చేస్తామని, వివరాలకు ఆస్పత్రిలో సంప్రదించాలని ఆయన సూచించారు.

News March 29, 2025

IPL: నేడు ముంబైVSగుజరాత్

image

IPLలో ఇవాళ ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. అహ్మదాబాద్‌లో రా.7.30కి మ్యాచ్ ప్రారంభమవుతుంది. తొలి మ్యాచుకు దూరమైన MI కెప్టెన్ హార్దిక్ ఇవాళ తుది జట్టులోకి రానున్నారు. టోర్నీ చరిత్రలో ఇరు జట్లు 5 సార్లు తలపడ్డాయి. మూడింట్లో GT, రెండింట్లో MI గెలిచింది. టాస్ గెలిచిన టీమ్ బౌలింగ్ ఎంచుకునే అవకాశం ఉంది. ఈ సీజన్‌ను రెండు జట్లు ఓటమితోనే ఆరంభించాయి. నేడు గెలుపు బోణీ కొట్టేదెవరో?

error: Content is protected !!