News November 15, 2024

అమలాపురం: ఫైనాన్స్ బిడ్‌లను ఓపెన్ చేసిన జేసీ

image

కోనసీమ జిల్లాలో ఇసుక త్రవ్వకాలు, వాహనాలలో లోడింగ్ స్టాక్ యార్డులకు తరలింపు, తిరిగి వాహనాల్లో లోడింగ్ ఛార్జీల వసూళ్లు నిమిత్తం పిలిచిన ఫైనాన్స్ బిడ్లను గురువారం రాత్రి జాయింట్ కలెక్టర్ నిషాంతి, జిల్లాస్థాయి ఇసుక కమిటీ సభ్యుల సమక్షంలో అమలాపురంలోని కలెక్టరేట్ వద్ద ఓపెన్ చేశారు. ఈ ఫైనాన్స్ బిడ్‌లలో తక్కువ రేటు కోడ్ చేసిన ఏజెన్సీలకు ఇసుక రీచుల ఆపరేషన్ నిర్వహణను అప్పగించడం జరుగుతుందని ఆమె తెలిపారు.

Similar News

News November 15, 2024

గొల్లప్రోలు: అత్తమామల వేధింపులు.. వివాహిత ఆత్మహత్య

image

భర్త, అత్తమామల వేధింపులు భరించలేక ఓ వివాహిత గురువారం ఆత్మహత్య చేసుకుంది. తుని SI శ్రీనివాసరావు వివరాల మేరకు.. గొల్లప్రోలుకు చెందిన దివ్య రైలు నుంచి దూకి ఆత్మహత్య చేసుకుందన్నారు. గర్భం దాల్చిన ఆమెను చికిత్స నిమిత్తం పిఠాపురంలో ఓ ఆసుపత్రికి అతని మావయ్య తీసుకెళ్లారు. ఆయన బయటకు వెళ్లొచ్చేసరికి కనిపించలేదు. పోలీసుల విచారణలో ఆత్మహత్య చేసుకున్నట్లు గుర్తించారు. 

News November 15, 2024

తూ.గో: నటుడు పోసానిపై పలుచోట్ల ఫిర్యాదులు

image

టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన పోసాని కృష్ణమురళిపై చర్యలు తీసుకోవాలని తుని, అనపర్తి, ముమ్మిడివరం మండలాల్లో గురువారం ముగ్గురు ఫిర్యాదులు చేశారు. తునిలో వెంకటేశ్వరస్వామి భక్తుడు శివాజీ, అనపర్తిలో TV5 ప్రతినిధి మణికంఠ, జర్నలిస్ట్ రమేశ్ స్థానిక పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేశారు. నటుడిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరామన్నారు.

News November 15, 2024

తూ.గో: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి..మరొకరికి గాయాలు

image

రాజానగరం మండలం తూర్పుగోనగూడెంలోని హైవేపై గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. స్థానిక SI మనోహర్ తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌కు నేవీ డిపర్ట్‌మెంట్‌కు చెందిన ముగ్గురు మినీ లారీలో వైజాగ్ వెళుతుండగా ఈ ప్రమాదం జరిగిందన్నారు. ఈ ఘటనలో త్రిపాఠి, షైబాజ్ మరణించగా..నగేశ్‌కి తీవ్రగాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించామన్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.