News April 5, 2025

అమలాపురం: మాజీ ఎంపీ హర్ష కుమార్‌పై కేసు నమోదు

image

అమలాపురం మాజీ ఎంపీ జీవీ హర్ష కుమార్‌పై రాజానగరం పోలీస్ స్టేషన్లో శుక్రవారం కేసు నమోదైంది. ఎస్సై నాగార్జున మాట్లాడుతూ పాస్టర్ పగడాల ప్రవీణ్ కుమార్ మృతిపై హర్షకుమార్ ప్రజల్ని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ శాంతిభద్రతలకు విఘాతం కలిగించారన్నారు. ఆరోపణలకు తగిన ఆధారాలు చూపించాలని కోరగా నేటికీ స్పందించలేదన్నారు. దీంతో ఆయనపై 196, 197 సెక్షన్ల కింద కేసు నమోదు చేస్తామన్నారు.

Similar News

News April 6, 2025

తారక మంత్రం పఠిస్తే ప్రయోజనాలు ఎన్నో?

image

తారక మంత్రాన్ని మూడు సార్లు చదివితే విష్ణు సహస్రనామ పారాయణం చేసినంత పుణ్యం వస్తుందని పండితులు చెబుతున్నారు. ఈ మంత్రాన్ని జపించడం వల్ల ఒత్తిడి తగ్గడమే కాకుండా సహనం పెరుగుతుంది. సానుకూల దృక్పథం ఏర్పడుతుంది. రామ అనే పదం బ్రహ్మ, విష్ణు, మహేశ్వర రూపంగా పరిగణిస్తారు. తారక మంత్రం ఇదే..
‘శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే
సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే’

News April 6, 2025

సోంపేట మండల యువకుడికి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం

image

ఇటీవల విడుదల అయిన SSC CGL ఫలితాల్లో సోంపేట మండలం బారువకొత్తూరులోని మత్స్యకార కుటుంబానికి చెందిన గురుమూర్తి సత్తా చాటారు. ఆల్ ఇండియా స్థాయిలో 374వ ర్యాంక్ సాధించి కేంద్రం ప్రభుత్వంలో ఉద్యోగం సాధించారు. కస్టమ్స్ విభాగంలో ఇన్‌స్పెక్టర్‌గా పోస్టింగ్ వచ్చినట్లు సన్నిహితులు తెలిపారు. దీంతో అతని తల్లిదండ్రులు శకుంతల, మోహనరావు ఆనందం వ్యక్తం చేశారు. అతనికి  గ్రామస్థులు అభినందనలు తెలిపారు.

News April 6, 2025

నెల్లూరు: బస్ స్టాండ్‌లలో రద్దీ

image

నేడు(ఆదివారం) శ్రీరామనవమి సందర్భంగా నెల్లూరు జిల్లా వ్యాప్తంగా పలు RTC బస్ స్టాండ్‌లలో రద్దీ ఏర్పడింది. బస్సులు ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి. దూర ప్రాంతాల్లో వ్యాపారులు, ఉద్యోగులు పండుగకు స్వగ్రామాలకు పయనం కావడంతో ఈ పరిస్థితి నెలకొంది. బస్ స్టాండ్‌లలో ఆకతాయిలు, జేబు దొంగల పట్ల ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. 

error: Content is protected !!