News February 8, 2025

అమెరికా అమ్మాయితో ఎన్టీఆర్ జిల్లా అబ్బాయి పెళ్లి 

image

ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలం కొణిజర్లకు చెందిన నంబూరు వరుణ్‌‌కు అమెరికా అమ్మాయితో వివాహమైంది. వరుణ్ USAలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. ఈ క్రమంలో షర్లెట్‌కు చెందిన ఎరికాతో పరిచయం ఏర్పడింది. అది కాస్త పెళ్లిగా మారింది. ఇద్దరు కుటుంబాల సమక్షంలో శుక్రవారం రాత్రి కొణిజర్లలో వారికి వివాహమైంది. నూతన వధూవరులను కుటుంబ సభ్యులు ఆశీర్వదించారు. 

Similar News

News February 8, 2025

కేసీఆర్‌ను కలిసిన వారంతా ఓటమి: కాంగ్రెస్

image

ఢిల్లీలో బీజేపీ గెలవడంతో రాహుల్ గాంధీని అభినందిస్తూ KTR చేసిన సెటైరికల్ ట్వీట్‌కు కాంగ్రెస్ నేతలు కౌంటరిస్తున్నారు. అరవింద్ కేజ్రీవాల్‌ BRS చీఫ్ KCRను కలవడం వల్లే ఓడిపోయారని ట్వీట్స్ చేస్తున్నారు. ‘మనం చెయ్యి కలిపితే మామూలుగా లేదుగా. YS జగన్, నవీన్ పట్నాయక్, థాక్రే, కేజ్రీవాల్’ అంటూ సెటైర్లు వేస్తున్నారు. కాగా ఢిల్లీలో కాంగ్రెస్ మరోసారి సున్నా సీట్లు గెలిచిందని BRS శ్రేణులూ రీకౌంటరిస్తున్నాయి.

News February 8, 2025

బాధ్యతగా ఎన్నికల విధులు నిర్వహించాలి: KMR కలెక్టర్

image

మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ పట్టభద్రుల, ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల దృష్ట్యా శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ తెలిపారు. కలెక్టరేట్ లో పీఓ, ఏపీఓ, ఓపీఓలకు మొదటి దఫా శిక్షణా కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల కోసం కేటాయించిన సిబ్బంది బాధ్యతగా విధులు నిర్వహించాలని ఆయన సూచించారు.

News February 8, 2025

ఇవాళ ‘పుష్ప-2’ థాంక్యూ మీట్

image

సుకుమార్, అల్లు అర్జున్ కాంబినేషన్లో తెరకెక్కిన ‘పుష్ప-2’ చిత్రం బాక్సాఫీసు వద్ద సంచలన విజయాన్ని నమోదు చేసింది. ఓటీటీలోకి వచ్చేసిన ఈ మూవీ టాప్ ప్లేస్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ క్రమంలో ఇవాళ ‘థాంక్యూ మీట్’ నిర్వహించనున్నట్లు మూవీ యూనిట్ పోస్ట్ చేసింది. సాయంత్రం 5 గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమానికి అల్లు అర్జున్ వచ్చే అవకాశమున్నట్లు సమాచారం.

error: Content is protected !!