News February 9, 2025
అమ్మవారి సేవలో గౌహతి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739025934841_60448509-normal-WIFI.webp)
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని గౌహతి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ విజయ్ బిష్ణోయ్ శనివారం రాత్రి సతీసమేతంగా దర్శించుకున్నారు. వారికి ఆలయం వద్ద ఏఈవో దేవరాజులు, ఇన్స్పెక్టర్ ప్రసాద్, అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అమ్మవారి కుంకుమార్చన సేవలో పాల్గొన్న వారికి ఆలయాధికారులు అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.
Similar News
News February 9, 2025
భద్రాద్రిలో దారుణం.. గర్భిణి ఆత్మహత్యాయత్నం
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739033927081_1280-normal-WIFI.webp)
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆళ్లపల్లి మండలంలోని రామాంజిగూడెంకు చెందిన మౌనిక అనే గర్భిణి కుటుంబ కలహాలతో శనివారం పురుగు మందు తాగి బలవన్మరణానికి యత్నించిందని స్థానికులు తెలిపారు. విషయం తెలుసుకున్న భర్త మధు హుటాహుటిన ఆళ్లపల్లి ప్రభుత్వాసుపత్రిలో ప్రథమ చికిత్స అందించి, మెరుగైన వైద్యం కోసం కొత్తగూడెం ఏరియా ఆసుపత్రికి తరలించినట్లు స్థానికులు వివరించారు.
News February 9, 2025
సీట్ల తేడా ఎక్కువున్నా ఓట్ల వ్యత్యాసం తక్కువే!
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739058580059_653-normal-WIFI.webp)
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో BJP, AAP మధ్య ఓట్ల తేడా 2% కంటే తక్కువే ఉంది. BJPకి 45.56% పోలవగా ఆప్‌కు 43.57% వచ్చాయి. కానీ సీట్ల తేడా మాత్రం 26 స్థానాలుగా ఉంది. కాషాయ పార్టీ 48 స్థానాలను గెలుచుకోగా ఆప్ 22 సీట్లకే పరిమితమైంది. అత్యధిక మెజార్టీతో గెలిచిన తొలి ముగ్గురు అభ్యర్థులూ ‘చీపురు’ పార్టీకి చెందినవారే కాగా అత్యల్ప మెజార్టీతో విజయం సాధించిన చివరి ముగ్గురూ కమలం అభ్యర్థులే కావడం గమనార్హం.
News February 9, 2025
రోహిత్ ఫామ్‌పై ఆందోళన లేదు: బ్యాటింగ్ కోచ్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739053944613_893-normal-WIFI.webp)
టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఫామ్ గురించి తమకు ఆందోళన లేదని బ్యాటింగ్ కోచ్ సితాన్షు కోటక్ తెలిపారు. ‘రోహిత్‌కు వన్డేల్లో 31 సెంచరీలున్నాయి. గత వన్డే సిరీస్‌లో(vsSL) 56, 64, 35 పరుగులు చేశాడు. టెస్టుల్లో విఫలమయ్యాడు కానీ వన్డేల్లో రన్స్ చేస్తూనే ఉన్నాడు. అతడి బ్యాటింగ్‌తో మాకు ఏ సమస్యా లేదు’ అని ప్రెస్ కాన్ఫరెన్స్‌లో స్పష్టం చేశారు.