News April 24, 2025
అమ్మవారిని దర్శించుకోవడం సంతోషంగా ఉంది: MLC కవిత

గోదావరిఖనిలో రేణుకా ఎల్లమ్మ కళ్యాణోత్సవ వేడుకలు బుధవారం కన్నుల పండుగగా జరిగింది. ఈ వేడుకల్లో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా MLC కల్వకుంట్ల కవిత ప్రత్యేకంగా హాజరై అమ్మవారిని దర్శించుకున్నారు. ‘శ్రీ రేణుకా ఎల్లమ్మ కళ్యాణ వేడుకల్లో పాల్గొని అమ్మవారిని దర్శించుకోవడం సంతోషంగా ఉంది. శ్రీ రేణుకా ఎల్లమ్మ ఆశీస్సులతో ప్రజలందరికీ శుభం కలగాలని’ ఆమె ఆకాంక్షించారు.
Similar News
News April 24, 2025
బల్కంపేట ఎల్లమ్మ గుడిలోని సంపులో పడి వ్యక్తి మృతి

బల్కంపేట ఎల్లమ్మ ఆలయానికి వచ్చిన ఓ వ్యక్తి సంపులో పడి మృతిచెందాడు. కాచిగూడకు చెందిన బి.బాలాజీ (48) కుటుంబ సభ్యులతో కలిసి ఎల్లమ్మ ఆలయానికి వచ్చాడు. అక్కడ నీటి సంపులో ఫోన్ పడిపోయింది. ఫోన్ తీసేందుకు యత్నించి సంపులో పడిపోయాడు. సిబ్బంది నిచ్చెన సాయంతో బాలాజీని బయటకు తీసి ఆసుపత్రికి తరలించారు. అతడు అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
News April 24, 2025
ఉగ్రదాడి: ఆ సినిమా విడుదలపై నిషేధం

పాక్ నటుడు ఫవాద్ ఖాన్ నటించిన ‘అబిర్ గులాల్’ సినిమాను భారత్‌లో విడుదల కానిచ్చేది లేదని పశ్చిమ భారత సినీ ఉద్యోగుల సంఘం(FWICE) స్పష్టం చేసింది. ఈ మేరకు ఓ ప్రెస్‌నోట్ విడుదల చేసింది. ‘ఉగ్రదాడుల నేపథ్యంలో భారత సినిమాల్లో పాక్ నటులు, గాయకులు, సాంకేతిక నిపుణులపై నిషేధం విధిస్తున్నాం. భారతీయ సినిమా నుంచి ఎవరూ వారితో కలిసి పనిచేయకూడదు. అబిర్ గులాల్ సినిమాను భారత్‌లో నిషేధిస్తున్నాం’ అని అందులో పేర్కొంది.
News April 24, 2025
కొరిశపాడు: గడ్డి మందు తాగి వివాహిత ఆత్మహత్య

కొరశపాడుకి చెందిన కాలే బిన్నీ తెలంగాణకు చెందిన వసంత (28)ని ప్రేమించి కులాంతర వివాహం చేసుకున్నాడు. గత 10 ఏళ్లుగా భర్త, అత్తమామలు, తోడికోడళ్ళతో కలిసి వసంత కొరిశపాడులోనే ఉంటుంది. అయితే కుటుంబ కలహాల కారణంగా మంగళవారం రాత్రి వసంత గడ్డి మందు తాగి ఆత్మహత్యకు యత్నించింది. చికిత్స పొందుతూ బుధవారం రాత్రి మరణించినట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని అన్నారు.