News April 17, 2025
అమ్మాయి ఎర.. HYDలో చెత్త కల్చర్!

HYD పబ్బుల్లో గబ్బు కల్చర్ పెరుగుతోంది. యువతను ఆకర్షిస్తూ కొందరు ఈ దందాకు తెరలేపుతున్నారు. అమ్మాయిలను ఎరవేస్తున్న నిర్వాహకులు కస్టమర్లను ఆకర్షిస్తున్నారు. ఒంటరిగా మందు తాగుదామని వస్తే యువతులతో కంపెనీ అని బిల్లులు గట్టిగానే వేస్తున్నారు. పోలీసులు చెక్ పెడుతున్నా.. ఈ తరహా ఘటనలు నగరంలో వెలుగుచూస్తూనే ఉన్నాయి. ఇక OYO హోటల్స్, కో-లివింగ్ కల్చర్ కూడా గ్రేటర్‌లో పుట్టగొడుగుల్లా విస్తరించడం గమనార్హం.
Similar News
News April 19, 2025
HYD: రివాల్యుయేషన్‌కు దరఖాస్తుల ఆహ్వానం

ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని ఎంసీఏ కోర్సుల పరీక్షా ఫలితాల రివాల్యుయేషన్‌కు దరఖాస్తులను స్వీకరించనున్నట్లు అధికారులు తెలిపారు. ఎంసీఏ మెయిన్, బ్యాక్ లాగ్ పరీక్షలతో పాటు దూరవిద్య ఎంసీఏ పరీక్ష రివాల్యుయేషన్‌కు ఒక్కో పేపర్‌కు రూ.800 చొప్పున చెల్లించి ఈ నెల 23వ తేదీలోగా టీఎస్ ఆన్లైన్ కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు. రూ.200 అపరాధ రుసుముతో ఈ నెల 25వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు.
News April 19, 2025
హైదరాబాద్: సీఎం పర్మిషన్ కోసం వెయిటింగ్

నగరంలో అక్కడక్కడా రోడ్లు దెబ్బతినగా వాటికి మరమ్మతులు చేయాల్సి ఉందని జీహెచ్ఎంసీ అధికారులు చెబుతున్నారు. ఆ పనుల కోసం టెండర్లు పిలవాల్సి ఉందంటున్నారు. నగరంలో దాదాపు 744 కిలోమీటర్లు రోడ్ల మరమ్మతులకు రూ.2,491 కోట్లు కావాలని అందుకోసం ఇప్పటికే సీఎం కార్యాలయానికి ప్రతిపాదనలు పంపామని చెబుతున్నారు. సీఎం రేవంత్ అనుమతి లభించిన తరువాత పనులు ప్రారంభం అవుతాయని అంటున్నారు.
News April 19, 2025
బేగంపేట: యముడు, చిత్రగుప్తుడి అవతారం ఎత్తారు

బేగంపేట చౌరస్తాలో NIPPON ఎక్స్‌ప్రెస్ CSR కమ్యూనిటీ సర్వీస్‌లో భాగంగా వాహనదారులకు వినూత్న రీతిలో పోలీసులు యముడు, చిత్రగుప్తుడి వేషధారణలో ట్రాఫిక్ నిబంధనలపై అవేర్నెస్ కల్పించారు. ట్రాఫిక్ సిగ్నల్ వద్ద హెల్మెట్, సీటు బెల్టులేని వారికి వాటి ఆవశ్యకతను వివరించారు. ట్రాఫిక్ ఏసీపీ వెంకటేశ్వర్లు, CI రామచందర్, బోస్‌కిరణ్, SI భూమేశ్వర్, NIPPON సుధీర్ నాయర్, కలీంఅలీ, అనిల్, ప్రియాంక సుధాకర్ సిబ్బంది ఉన్నారు.