News April 2, 2025
అమ్మాయిపై గ్యాంగ్ రేప్.. నాగర్‌కర్నూల్‌లో ఆందోళన

ఊర్కొండపేటలో జరిగిన అత్యాచార ఘటనలో నిందితులను చట్టప్రకారం కఠినంగా శిక్షించాలని, బాధితురాలికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం నాగర్‌కర్నూల్‌లోని అంబేడ్కర్ విగ్రహం దగ్గర సీపీఎం ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. కార్యదర్శి వర్ధం పర్వతాలు మాట్లాడుతూ..అక్కడ ఒక గ్యాంగ్ మాటు వేసుకుని ఉందంటే ఈ తతంగం ఇప్పటికిప్పుడు జరిగిందేమీ కాదని, కొంతమంది సహకారం లేకపోతే ఇలాంటి క్రూర, దుర్మార్గమైన ఘటనలు జరగవన్నారు.
Similar News
News April 5, 2025
విశాఖ: తండ్రి బైకు కొని ఇవ్వలేదని కొడుకు ఆత్మహత్య

తండ్రి బైకు కొని ఇవ్వలేదని కారణంతో యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన విశాఖ నగరంలో వెలుగు చూసింది. రామా టాకీస్ ప్రాంతంలో నివాసముంటున్న కార్తీక్ తండ్రి వాచ్మెన్‌గా పనిచేస్తున్నాడు. కార్తీక్ కొద్దిరోజులుగా బైక్ కోసం తండ్రితో గొడవ పడేవాడు. బైకు కొనకపోవడంతో ఇంట్లోనే ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న ద్వారక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
News April 5, 2025
రిటైర్డ్ హర్ట్.. రిటైర్డ్ ఔట్ తేడాలివే?

క్రికెట్‌లో రిటైర్డ్ హర్ట్, రిటైర్డ్ ఔట్ పదాలు ఒకేలా ఉన్నా వీటి మధ్య కాస్త తేడా ఉంటుంది. రిటైర్డ్ హర్ట్ అనగా బ్యాటర్ గాయంతో లేదా ఏదైనా ఇతర సమస్యతో మైదానాన్ని వీడుతారు. తిరిగి క్రీజులోకి వచ్చే అవకాశం ఉంటుంది. రిటైర్డ్ ఔట్ అనగా ఇతర కారణాలతో ఇన్నింగ్సును కొనసాగించకుండా గ్రౌండ్‌ను వీడుతారు. తిరిగి క్రీజులోకి రావాలంటే ప్రత్యర్థి జట్టు కెప్టెన్ అనుమతి అవసరం. నిన్న <<15996543>>తిలక్ రిటైర్డ్ ఔట్‌గా<<>> గ్రౌండ్ వీడారు.
News April 5, 2025
హత్నూర: ఇద్దరు గల్లంతు.. ఒకరి మృతదేహం లభ్యం

సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం బోర్పట్ల భీముని చెరువులో గల్లంతైన ఇద్దరిలో ఒకరి మృతదేహం లభ్యమైనట్లు స్థానిక పోలీసులు తెలిపారు. మండలంలోని బోర్పట్ల గ్రామానికి చెందిన డప్పు నవీన్ కుమార్ మృతదేహం లభ్యమైందని చెప్పారు. కొండాపూర్ మండలం కొత్త గడి గ్రామానికి చెందిన ప్రేమ్ కుమార్ మృతదేహం కోసం మత్స్యకారులు, గజ ఈతగాళ్లు గాలిస్తున్నారని చెప్పారు.