News February 5, 2025

అయిజ: యువకుడి పై కత్తితో దాడి.. గాయాలు

image

అయిజ నరసప్ప గుడి కాలనీకి చెందిన చేనేత కార్మికుడు నేష మోనాష్ పై అదే కాలనీలో నివాసం ఉంటున్న గూడు బాషా అనే వ్యక్తి బుధవారం ఉదయం ఇంట్లోకి చొరబడి కత్తితో దాడి చేశాడు. దీంతో మోనాష్ కు తీవ్ర గాయాలు అయ్యాయి. మోనాష్ కుటుంబ సభ్యులు అతడిని ఆసుపత్రికి తరలించారు. ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

Similar News

News February 5, 2025

ముగిసిన ఢిల్లీ ఎన్నికల పోలింగ్

image

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. సాయంత్రం 5 గంటల వరకు 58 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. సాయంత్రం 6 గంటల వరకు క్యూలో ఉన్న వారికి ఓటు వేసే అవకాశం కల్పించనున్నారు. సా.6.30 గంటల తర్వాత ఎగ్జిట్ పోల్స్ వెల్లడి కానున్నాయి.

News February 5, 2025

HYD: బాలికతో అసభ్య ప్రవర్తన.. వ్యక్తికి ఏడాది జైలు శిక్ష

image

బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన కిరణ్ అనే యువకుడికి ఎల్బీనగర్ ఫాస్ట్ ట్రాక్ కోర్డు ఏడాది జైలు శిక్ష, రూ.2 వేల జరిమానా విధించింది. పోలీసుల వివరాలిలా.. సరూర్ నగర్ పరిధికి చెందిన కిరణ్ ఓ బాలికతో పరిచయం పెంచుకుని ప్రేమ పేరుతో వేధించాడు. ఈ ఘటన 2020లో జరగ్గా కేసు నమోదైంది. తాజాగా కోర్టు శిక్ష విధించింది.

News February 5, 2025

ADB: రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి తీవ్ర గాయాలు

image

ఆదిలాబాద్‌లో బుధవారం రోడ్డు ప్రమాదం జరిగింది. లాండసాంగి గ్రామ సమీపంలోని రహదారిపై మహారాష్ట్ర పాటన్ బోరికి చెందిన షాలిక్‌కు రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలైనట్లు స్థానికులు తెలిపారు. వెంటనే అతడిని 108లో ఆసుపత్రికి తరలించారు. కాగా ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

error: Content is protected !!