News March 31, 2025

అయిజ: ‘రతంగాపాణి రెడ్డి మన మధ్య లేకపోవడం బాధాకరం’

image

అయిజ మండలం ఉప్పల గ్రామానికి చెందిన మలిదశ తెలంగాణ ఉద్యమకారుడు రతంగపాణి రెడ్డి మన మధ్య లేకపోవడం అత్యంత బాధాకరమని అఖిలపక్ష కమిటీ నాయకులు నాగర్‌దొడ్డి వెంకట రాములు, ఆంజనేయులు, హనుమంతు పేర్కొన్నారు. సోమవారం ఉప్పల గ్రామంలో ఆయన భౌతికదేహాన్ని సందర్శించి పూలమాలవేసి నివాళులు అర్పించారు. మలిదశ ఉద్యమంలో రాష్ట్ర సాధన ఆవశ్యకత గురించి యువతను చైతన్యం చేశాడని కొనియాడారు. కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పారు.

Similar News

News April 3, 2025

నేడు కర్నూలుకు వైఎస్‌ జగన్‌

image

వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ నేడు కర్నూలుకు రానున్నారు. ఉ.9.30 గంటలకు తాడేపల్లి నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి 11.30 గంటలకు కర్నూలుకు చేరుకుంటారు. అనంతరం నగర శివారులోని జీఆర్‌సీ కన్వెన్షన్‌ సెంటర్‌లో వైసీపీ నేత కోట్ల హర్షవర్దన్‌ రెడ్డి కుమార్తె వివాహ వేడుకల్లో పాల్గొంటారు. వధూవరులను ఆశీర్వదించిన తర్వాత జిల్లా నేతలతో సమావేశం కానున్నారు. మ.12.50 గంటలకు తాడేపల్లికి తిరుగుపయనం అవుతారు.

News April 3, 2025

VZM: రైలు నుంచి జారిపడి కానిస్టేబుల్ మృతి

image

ప్రమాదవశాత్తు రైలు నుంచి జారిపడిన కానిస్టేబుల్ బొబ్బిలి రామకోటి(37) చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. జామి మండలానికి చెందిన రామకోటి ప్రస్తుతం కొత్తవలస పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్నారు. ఈనెల 1వ తేదీన రామకోటి విశాఖ నుంచి విజయనగరం వస్తున్న సమయంలో కోరుకొండ- విజయనగరం రైల్వే స్టేషన్ మధ్య జొన్నవలస సమీపంలో ప్రమాదవశాత్తు జారి పడటంతో మహారాజు ఆస్పత్రికి తరలించారు. చికిత్స పోందుతూ మరణించాడు.

News April 3, 2025

జగిత్యాల: ముగిసిన పదిపరీక్షలు.. పిల్లలపై ఓ కన్నేసి ఉంచండి!

image

పదోతరగతి పరీక్షలు ముగిశాయి. దీంతో విద్యార్థులు ఫ్రీ బర్డ్స్ లాగా విచ్చలవిడిగా తిరగాలని భావిస్తారు. కావున తల్లిదండ్రులు వారి కదలికలపై ఓ కన్నేసి ఉంచాలని నిపుణులు సూచిస్తున్నారు. పిల్లలకు మోటార్ బైకులు ఇవ్వొద్దు. స్నేహితులతో చెరువులకు వెళ్లకుండా చూడాలి. వారు ఈత నేర్చుకుంటానంటే తల్లిదండ్రుల పర్యవేక్షణలో నేర్చుకోవాలి. మత్తుపదార్థాలకు అలవాటు పడుతున్నారా లేదా గమనిస్తూ ఉండాలంటున్నారు. PLEASE SHARE IT.

error: Content is protected !!