News September 21, 2024

అయోధ్య బాలరాముడిని దర్శించుకున్న నంద్యాల MP

image

నంద్యాల ఎంపీ డా.బైరెడ్డి శబరి అయోధ్యలోని శ్రీ బాల రాముడిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. దేశంలో ప్రధాని మోదీ, రాష్ట్రంలో సీఎం చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో రామరాజ్య పాలన కొనసాగుతుందన్నారు. వీరికి మరింత పరిపాలన శక్తి అనుగ్రహించాలని అయోధ్య రామునికి పూజలు చేశానన్నారు.

Similar News

News September 21, 2024

నందికొట్కూరు మండలానికి రానున్న మంత్రి నిమ్మల

image

నందికొట్కూరు మండలం మల్యాల గ్రామానికి ఈ నెల 22న (రేపు) రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు రానున్నారు. ప్రాజెక్టుల సందర్శనలో భాగంగా మండలంలోని హంద్రీనీవా ఎత్తిపోతల పథకాన్ని పరిశీలిస్తారని ఇరిగేషన్ అధికారులు తెలిపారు. ప్రాజెక్ట్ నిర్వహణ, పనితీరుపై సమీక్షించనున్నారు. రైలుమార్గంలో ఉదయం డోన్ చేరుకుంటారు. అక్కడినుంచి కర్నూలు ప్రభుత్వ అతిథి గృహం చేరుకొని ఇరిగేషన్ అధికారులతో సమీక్ష చేపట్టనున్నారు.

News September 21, 2024

రాఘవేంద్రస్వామిని దర్శించుకున్న ఆకాశ్ పూరీ

image

మంత్రాలయం శ్రీ గురు రాఘవేంద్ర స్వామిని సినీ హీరో ఆకాశ్ పూరీ దర్శించుకున్నారు. ఆయనకు శ్రీమఠం అధికారులు ప్రత్యేక దర్శన సదుపాయం కల్పించారు. గ్రామ దేవత శ్రీ మంచాలమ్మ దేవి, గురు రాఘవేంద్ర స్వామి మూల బృందావనాన్ని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం శ్రీమఠం పీఠాధిపతులు ఫలమంత్రాక్షితలు ఇచ్చి ఆశీర్వదించారు.

News September 21, 2024

పత్తికొండలో క్వింటా టమాటా రూ.3,200

image

రాష్ట్రంలో మదనపల్లి తర్వాత కర్నూలు జిల్లాలోని పత్తికొండ టమాటా మార్కెట్ అతిపెద్దది. జిల్లాలోని తుగ్గలి, మద్దికేర, ఆలూరు, ఆస్పరి తదితర మండలాల నుంచి పత్తికొండ మార్కెట్‌కు రైతులు పెద్ద ఎత్తున టమాటాలు తీసుకొస్తారు. వారం రోజులుగా ఈ మార్కెట్‌లో ధరలు నిలకడగా ఉండటంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కిలో గరిష్ఠంగా రూ.30పైనే పలుకుతున్నాయి. నిన్న క్వింటా టమాటా గరిష్ఠంగా రూ.3,200 పలికింది.