News May 18, 2024

అరకు పర్యాటక ప్రాంతాలు వెలవెల

image

పర్యాటక కేంద్రమైన అరకులోయలోని సందర్శింత ప్రాంతాలు పర్యాటకులు లేక వెలవెల బోతున్నాయి. ప్రతి ఏడాది టెన్త్, ఇంటర్ పరీక్షల అనంతరం పర్యాటకులు అధిక సంఖ్యలో అరకు ప్రాంతాన్ని సందర్శించేవారు. ఈ ఏడాది ఎన్నికల హడావుడి మొదలు కావడంతో పర్యాటకుల సంఖ్య పూర్తిగా పడిపోయింది. పర్యాటకులు మచ్చుకైనా కనిపించక పోవడంతో ఈ ప్రాంతంలోని సందర్శిత ప్రాంతాలన్నీ వెలవెలపోయాయి. దీంతో స్థానిక వ్యాపారులు ఇబ్బందులు పడుతున్నారు.

Similar News

News December 26, 2024

విశాఖ: కూటమిలో ఆడారి ఇముడుతారా?

image

విశాఖ డెయిరీ ఛైర్మన్ ఆడారి ఆనంద్ బీజేపీలో చేరడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కూటమి ప్రభుత్వం రాగానే డెయిరీలో అక్రమాలు జరిగాయంటూ ఉమ్మడి జిల్లా టీడీపీ నేతలు అసెంబ్లీ వేదికగా ఆరోపించారు. ఇదే ప్రాంతానికి చెందిన స్పీకర్ అయ్యన్న సైతం వారి ఆరోపణలకు ఏకీభవించి విచారణకు ఆదేశించారు. దీంతో ఆడారి టీడీపీలో చేరాలని ప్రయత్నించగా బాహటంగానే ఆ పార్టీ నేతలు వ్యతిరేకించడంతో ఆయన బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు.

News December 26, 2024

గోల్డ్ అవార్డు గెలుచుకున్న విశాఖ స్టీల్ ప్లాంట్

image

విశాఖ స్టీల్ ప్లాంట్ ఇంధన పొదుపులో గోల్డ్ అవార్డు గెలుచుకుంది. అవార్డును విశాఖ ఉక్కు కర్మాగారం తరఫున ఇంధన, పర్యావరణం జనరల్ మేనేజర్ ఉత్తమ బ్రహ్మ, డీజిఎం విజయానంద్ గురువారం విజయవాడలో స్వీకరించారు. స్టీల్ ప్లాంట్‌కు మరోసారి ప్రతిష్ఠాత్మకమైన అవార్డు సాధించినందుకు ప్లాంట్ సీఎండీ ఏకె సక్సేనా అధికారులు సిబ్బందిని అభినందించారు.

News December 26, 2024

విశాఖ: ‘మద్యం మత్తులో ఆటో డ్రైవర్ మృతి’

image

పనోరమ హిల్స్ వద్ద మద్యం మత్తులో ఆటో డ్రైవర్ మృతి చెందిన ఘటన గురువారం ఉదయం చోటు చేసుకుంది. మర్రిపాలెంకు చెందిన ఎస్.నాగేశ్వరరావు(38) ఆటోలో కేటరింగ్ సామాన్లు తీసుకువచ్చి అనుమాస్పద స్థితిలో పడి ఉన్నాడు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని అతను మృతి చెందినట్లు ధ్రువీకరించారు. మృతిపై ఎలాంటి అనుమానం లేదని..అతిగా మద్యం తాగిన కారణంగానే అతను మరణించినట్లు పీఎంపాలెం సీఐ జి.బాలకృష్ణ తెలిపారు.