News February 9, 2025

అరకు: మన్యం బంద్‌కు సీపీఎం మద్దతు  

image

మన్యం బంద్‌ ఫిబ్రవరి 11, 12 తేదిల్లో జరుగనున్నది. దానికి సీపీఎం సంపూర్ణ మద్దతు ఇస్తుందని అరకులోయ సీపీఎం మండల కార్యదర్శి రామారావు తెలిపారు. ఈ మేరకు ఆయన మన్యం బంద్ జయప్రదం చేయాలని ఆదివాసి గిరిజన సంఘం అఖిలపక్ష ప్రజాసంఘాలు ఆధ్వర్యంలో ముద్రించిన కరపత్రాలు విస్తృతంగా పంచారు. ఆదివాసిల 1/70 చట్టాన్ని సవరించాలని రాష్ట్ర స్పీకర్ అయ్యన్న పాత్రుడు వ్యాఖ్యలను ఖండిస్తున్నామన్నారు.

Similar News

News February 10, 2025

హైడ్రాపై హైకోర్టు ఆగ్రహం

image

TG: సెలవు దినాల్లో అక్రమ నిర్మాణాల కూల్చివేతలను చేపట్టొద్దని హైడ్రాకు హైకోర్టు సూచించింది. శుక్రవారం నోటీసులిచ్చి, వివరణ ఇచ్చేందుకు శనివారం ఒక్కరోజే సమయమిస్తూ ఆదివారం కూల్చివేస్తుండటంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. రంగారెడ్డి(D) అబ్దుల్లాపూర్‌మెట్(M) కోహెడలో నిర్మాణాల కూల్చివేతలపై నమోదైన పిటిషన్‌ను విచారించింది. వివరణ ఇచ్చేందుకు భవన యజమానులకు సహేతుకమైన సమయం ఇవ్వాలని పేర్కొంది.

News February 10, 2025

హత్నూర: దౌల్తాబాద్ విద్యార్థుల ప్రతిభ

image

హైదరాబాద్‌లోని విశ్వేశ్వరయ్య భవన్ లో అగస్త్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి సైన్స్ ఫెయిర్ ఆదివారం నిర్వహించారు. హత్నూర మండలం దౌల్తాబాద్ 9వ తరగతి విద్యార్థులు నవాజ్, భవానీ, అన్విత క్రియ ఆర్టిజన్ స్పెక్ట్రమ్ డిజాస్టర్ నమూనాకు రూ. 30 వేల బహుమతి అందుకున్నారు. వీరిని జాతీయ స్థాయికి ఎంపిక చేశారు. విద్యార్థులు, గైడ్ ఉపాధ్యాయుడు వెంకటేశంను కలెక్టర్ వల్లూరు క్రాంతి అభినందించారు.

News February 10, 2025

ఇంటర్నేషనల్ కరాటే టోర్నమెంట్స్‌లో మందమర్రి బాలుడు

image

హైదరాబాద్ సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో ఆదివారం న్యూ డ్రాగన్ కరాటే అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇంటర్నేషనల్ కరాటే టోర్నమెంట్స్‌లో మందమర్రికి చెందిన బిఎంఆర్ కరాటే అకాడమీ విద్యార్థి సత్తా చాటారు. అండర్‌14 కటాస్ విభాగంలో జి. సాయి అత్యుత్తమ ప్రతిభ కనబరిచి గోల్డ్ మెడల్ సాధించారు. ఈ సందర్భంగా ప్రముఖ సినీ నటుడు భానుచందర్, బిఎంఆర్ అకాడమీ నిర్వాహకులు సంతోష్, మాస్టర్ కర్ర వెంకటేష్, శశి అభినందించారు.

error: Content is protected !!