News March 3, 2025
అరుణాచల గిరి ప్రదర్శనకు ప్రత్యేక బస్సులు: ఆర్ఎం జానీ రెడ్డి

అరుణాచల గిరి ప్రదర్శన కోసం మార్చి 12వ తేదీ సాయంత్రం 7 గంటలకు అన్ని డిపోల నుంచి ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు ఉమ్మడి నల్గొండ రీజినల్ మేనేజర్ కే. జాని రెడ్డి తెలిపారు. ప్రతి పౌర్ణమికి రద్దీని బట్టి ప్రత్యేక సర్వీసులు నడిపిస్తామని, అరుణాచలం వెళ్లే భక్తులకు ఏపీలోని కాణిపాకం, తమిళనాడులోని వేలూరు గోల్డెన్ టెంపుల్ దర్శనం కూడా ఉంటుందని వివరాలకు 92980 08888 సంప్రదించాలన్నారు.
Similar News
News March 4, 2025
నల్గొండ: శ్రీపాల్ రెడ్డికి 13,969 ఓట్లు

వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ముగిసింది. పీఆర్టియూ టీఎస్ అభ్యర్థి పింగళి శ్రీపాల్ రెడ్డి తన సమీప ప్రత్యర్థి యూటీఎఫ్ అభ్యర్థి అలుగుబెల్లి నర్సిరెడ్డితో పోటీపడి 13,969 ఓట్లు సాధించారు. ఎలిమినేషన్ ప్రక్రియ ఆసాంతం ఎంతో ఉత్కంఠగా కొనసాగింది. చివరకు మూడో స్థానంలో ఉన్న హర్షవర్ధన్ రెడ్డి ఎలిమినేషన్‌తోనే శ్రీపాల్ రెడ్డి గెలుపు ఖరారైంది.
News March 4, 2025
నల్గొండ: జిల్లా పోలీస్ కార్యాలయంలో భరోసా కన్వర్జెన్ మీటింగ్

నల్గొండ జిల్లా పోలీస్ కార్యాలయంలో లైంగిక వేధింపులకు గురైన బాధిత మహిళలకు తీసుకోవాల్సిన తక్షణ సహాయక చర్యలపై లీగల్, మెడికల్, ఉమెన్, చైల్డ్ వెల్ఫేర్ సంబంధిత అధికారులతో జిల్లా SP శరత్ చంద్ర పవార్ ఆధ్వర్యంలో భరోసా కన్వర్జెన్ మీటింగ్‌ను సోమవారం నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్యఅతిథులుగా అడిషనల్ డిస్ట్రిక్ట్ & సెషన్ జడ్జి కులకర్ణి, డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ చైర్ పర్సన్ దీప్తి పాల్గొన్నారు.
News March 4, 2025
నల్గొండ: ‘భరోసా ద్వారా బాధిత మహిళలకు అండగా నిలవాలి’

భరోసా సెంటర్ ద్వారా బాధిత మహిళలకు రక్షణ కల్పించాలని జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ అన్నారు. నల్లగొండ జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం లైంగిక వేధింపులకు గురైన బాధిత మహిళలకు తీసుకోవాల్సిన తక్షణ సహాయక చర్యలపై లీగల్, మెడికల్, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్, సంబంధిత అధికారులతో భరోసా కన్వర్జేన్ సమావేశం నిర్వహించారు.