News January 21, 2025

అర్జీలపై అధికారులు దృష్టి పెట్టాలి: ప్రకాశం కలెక్టర్

image

ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చే ఆర్జీలపై సంబంధిత శాఖల అధికారులు ప్రత్యేక దృష్టి సారించి సత్వరమే పరిష్కరించేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్ తమీమ్ అన్సారియా ఆదేశించారు. సోమవారం ఒంగోలు కలెక్టరేట్‌లో మీ కోసం కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో 302 అర్జీలు వచ్చాయన్నారు. వీటిని ఆయా శాఖల అధికారులకు సూచిస్తూ సత్వరం పరిష్కరించేలా ప్రత్యేక శ్రద్ద చూపాలని కలెక్టర్ ఆదేశించారు.

Similar News

News February 5, 2025

ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి: కలెక్టర్

image

పీసీపల్లి మండలం వాటర్ షెడ్ ప్రారంభోత్సవం కార్యక్రమానికి బుధవారం కనిగిరి MLA ముక్కు ఉగ్ర నరసింహరెడ్డితో కలిసి ప్రకాశం కలెక్టర్ తమీమ్ అన్సారియా హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్, MLA మొక్కలు నాటారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని ప్రజలకు సూచించారు. మొక్కలు పెంచడం వలన ఆక్సిజన్ సమృద్ధిగా అందుతుందన్నారు.

News February 5, 2025

ప్రకాశం: వరల్డ్ కప్‌‌ విజేతకు ఘన స్వాగతం

image

ఢిల్లీలో  జరిగిన ఖోఖో వరల్డ్ కప్‌‌లో భారత్ విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. కాగా జట్టు గెలుపులో ముండ్లమూరు మండలం ఈదర గ్రామానికి చెందిన పోతిరెడ్డి శివారెడ్డి  కీలక పాత్ర పోషించాడు. శివారెడ్డి మంగళవారం తన స్వగ్రామం చేరుకున్నాడు. దీంతో అతనికి గ్రామ ప్రజలు ఘన స్వాగతం పలికారు. తమ ఊరి కుర్రాడు దేశాన్ని వరల్డ్ ఛాంపియన్‌గా నిలపడం గర్వకారణంగా ఉందని వారు సంతోషం వ్యక్తం చేశారు

News February 4, 2025

దర్శి: గుప్తనిధుల కోసం తవ్వకాలు

image

దర్శి మండలం శివరాజ్ నగర్ శివారులోని శ్రీ సాయిబాబా గుడి శ్రీ దత్తాశ్రమం పక్కనగల కొండ పైన గుర్తుతెలియని కొందరు వ్యక్తులు గుప్తనిధుల కొరకు కొండను తవ్వుతున్నారన్న సమాచారం మేరకు దర్శి ఎస్ఐ మురళి తన సిబ్బందితో దాడి చేశారు. ఈ క్రమంలో ఐదుగురు కొండను తవ్వుతుండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ మురళి తెలిపారు.

error: Content is protected !!