News January 22, 2025
అర్హుల ఎంపిక కోసమే గ్రామసభ: ADB కలెక్టర్
అర్హులైన లబ్ధిదారుల ఎంపిక కోసమే గ్రామ సభలను ఏర్పాటు చేశామని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు. బుధవారం మధ్యాహ్నం ఉట్నూరు మండలంలోని ఉమ్రి గ్రామసభలో ఆయన పాల్గొని మాట్లాడారు. కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు, తదితర పథకాల కోసం లబ్ధిదారులను ఎంపిక చేయడానికి నూతన దరఖాస్తులు స్వీకరిస్తున్నానని తెలిపారు అర్హులైన వారు గ్రామసభలో సమర్పిస్తే లబ్ధిదారులను ఎంపిక చేయడం జరుగుతుందన్నారు.
Similar News
News January 22, 2025
నిర్మల్: కాశీలో గుండెపోటుతో ఫార్మసిస్టు మృతి
నిర్మల్లోని ప్రధాన ఆస్పత్రిలో ఆయుర్వేద ఫార్మసిస్టుగా పనిచేస్తున్న ఫణిందర్ (50) గుండెపోటుతో మృతి చెందాడు. పట్టణంలోని బుధవార్ పేట్ కాలనీకి చెందిన ఫణిందర్ ఉత్తర్ ప్రదేశ్లోని కుంభమేళాకు వెళ్లారు. కాశీలో దైవ దర్శనం చేస్తున్న క్రమంలో గుండెపోటుతో మంగళవారం మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు.
News January 22, 2025
నాగోబా జాతర విశేషాలు మీకు తెలుసా..!
తెలంగాణలోనే రెండో అతిపెద్దదైన నాగోబా జాతర జనవరి 28న ప్రారంభం కానుంది. మేస్రం వంశీయులు ఇప్పటికే గంగాజలం తీసుకొని రావడానికి జన్నారంలోని కలమడుగుకు బయలుదేరారు. అయితే వారు జలం తీసుకొచ్చే కుండులను ఓ ప్రత్యేక వంశీయులే చేస్తారని చాలా మందికి తెలియదు. ఈ కుండలను సిరికొండలోని గుగ్గిల్ల వంశీయులు తయారుచేస్తారు. మేస్రం వంశీయులు పూజకు వినియోగించే దీపంతలు, నీటికుండలు, వంట ఉపయోగించే పాత్రలను కూడా వారే అందిస్తారు.
News January 22, 2025
ADB: భారత జట్టులో ఆదిలాబాద్ ఉద్యోగి
దిల్లీలో నిర్వహించిన ఖోఖో అంతర్జాతీయ ఛాంపియన్షిప్ పోటీల్లో పాల్గొని ట్రోఫీ అందుకున్న టీంలో సభ్యుడిగా ఆదిలాబాద్ తపాలా ఉద్యోగి ఉన్నారు. తపాలా శాఖలో విధులు నిర్వహిస్తున్న ఆదిలాబాద్ పోస్టల్ అసిస్టెంట్ శివారెడ్డి భారత జట్టు తరఫున ఆడారు. ఈ సందర్భంగా మొదటి మ్యాచ్ లోనే బెస్ట్ అటాకర్గా పేరు పొందారు. భారత ఖోఖో జట్టు విశ్వ విజేతగా నిలవడంలో కీలక భూమిక పోషించారు. ఆయనకు తపాలా శాఖ ఉద్యోగులు అభినందనలు తెలిపారు.