News March 5, 2025
అర్హుల ఎంపికను పూర్తి చేయాలి: హనుమకొండ కలెక్టర్

మిషన్ వాత్సల్య పథకానికి అర్హులైన వారి జాబితాను సిద్ధం చేయాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య అన్నారు. మంగళవారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాల్‌లో వాత్సల్య పథకం అర్హుల ఎంపికపై జిల్లా స్థాయి కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. మిషన్ వాత్సల్య పథకానికి జిల్లాలో ఎంతమంది ఎంపికయ్యారని, ఎన్ని దరఖాస్తులు ఇప్పటి వరకు వచ్చాయనే, తదితర వివరాలు కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు.
Similar News
News March 6, 2025
పోరాట సింహం.. ‘మిల్లర్’ కిల్లర్

కివీస్‌తో CT సెమీస్‌లో SA ఓడినా మిల్లర్ చేసిన పోరాటం సగటు క్రికెట్ అభిమాని మనసును గెలిచింది. లక్ష్యం అందనంత దూరంలో ఉన్నా జట్టును గెలిపించాలనే కసితో చేసిన ప్రయత్నం అసామాన్యం. మరో ఎండ్ నుంచి సపోర్ట్ లేకపోయినా ఫోర్లు, సిక్సులతో కివీస్ బౌలర్లపై కనికరం లేకుండా చెలరేగారు. ఈ క్రమంలో చివరి 25 బంతుల్లో 54 రన్స్ చేశారు. మరో 3ఓవర్లు ఉంటే మిల్లర్ మ్యాచ్‌ను గెలిపించేవారని ఫ్యాన్స్ పోస్టులు పెడుతున్నారు.
News March 6, 2025
HYD: మహిళా సదస్సు ఏర్పాట్లపై CS సమీక్ష

పరేడ్ గ్రౌండ్‌లో ఈ నెల 8న జరగనున్న మహిళా సదస్సు ఏర్పాట్లపై CS శాంతికుమారి సమీక్ష నిర్వహించారు. కార్యక్రమంలో సీఎం మహిళా శక్తి పాలసీ విడుదల చేయనుండగా, మహిళా సమాఖ్యలకు బస్సులను జెండా ఊపి ప్రారంభించనున్నారు. కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. బస్సుల పార్కింగ్ కోసం బైసన్‌పోలో మైదానం సిద్ధం చేయాలని సూచించారు. పారిశుద్ధ్య ఏర్పాట్లు పర్యవేక్షించాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు.
News March 6, 2025
BREAKING: నాంపల్లిలో రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి

నాంపల్లి మండల కేంద్రానికి చెందిన వ్యక్తి బుధవారం రాత్రి వడ్డేపల్లి రోడ్డు ప్రమాదం జరిగింది. వట్టిపల్లి వద్ద బత్తాయి తోటలో పనులు ముగించుకుని తన భార్యతో కలిసి వస్తుండగా నాంపల్లి మండలం వడ్డేపల్లి మూలమలుపు వద్ద ప్రమాదానికి గురై అక్కడికక్కడే మృతి చెందారు. నాంపల్లికి చెందిన పూల సత్తయ్య, సత్తమ్మ కుమారుడు రవిగా గుర్తించినట్లు స్థానికులు తెలిపారు. ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.