News April 3, 2025
అర్హులందరూ దరఖాస్తు చేసుకోవాలి: నిర్మల్ కలెక్టర్

రాజీవ్ యువ వికాసం పథకానికి అర్హులందరూ దరఖాస్తు చేసుకునేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో బుధవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో రాజీవ్ యువ వికాసం పథకంపై సంబంధిత అధికారులతో ఆమె సమావేశం నిర్వహించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల వారు వినియోగించుకోవాలని పేర్కొన్నారు.
Similar News
News April 4, 2025
గద్వాల: గోడపత్రికలను విడుదల చేసిన జిల్లా కలెక్టర్

జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం అంబేడ్కర్ ఆలోచన పండగ గోడపత్రికలను కలెక్టర్ సంతోష్ విడుదల చేశారు. ఆల్ ఇండియా అంబేడ్కర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈనెల 12న జిల్లా కేంద్రంలో అంబేడ్కర్ ఆలోచన పండుగను నిర్వహిస్తున్న సందర్భంగా గోడపత్రికలను విడుదల చేసినట్లు కలెక్టర్ తెలిపారు. ప్రతి ఒక్కరూ ఆలోచన పండుగకు హాజరై విజయవంతం చేయాలన్నారు. బుడకల ప్రకాశ్, తదితరులు పాల్గొన్నారు.
News April 4, 2025
జగిత్యాల: చీఫ్ ప్లానింగ్ అధికారినిగా ఉమారాణి

జగిత్యాల జిల్లా చీఫ్ ప్లానింగ్ అధికారినిగా ఉమారాణి శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. కరీంనగర్‌లో పని చేస్తున్న ఉమారాణి జగిత్యాలకు బదిలీ అయ్యారు. జగిత్యాల పట్టణంలోని సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలోని చీఫ్ ప్లానింగ్ కార్యాలయంలో బాధ్యతలు తీసుకున్నారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఉమారాణిని పలువురు కార్యాలయ అధికారులు, ఉద్యోగులు అభినందించారు.
News April 4, 2025
అధ్యక్ష పదవికి విశాఖ నార్త్ ఎమ్మెల్యే నామినేషన్

విశాఖ నార్త్ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ఫిల్మ్ నగర్ క్లబ్ అధ్యక్ష పదవికి శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. మొత్తం 38 నామినేషన్లు వేసినట్లు సమాచారం. కాగా.. అధ్యక్ష పదవికి విష్ణుకుమార్ రాజుతో పాటు సినీ నిర్మాత కేఎస్ రామారావు కూడా పోటీలో ఉన్నారు. ఈ కార్యక్రమంలో విశాఖ జిల్లా బీజేపీ పార్టీ అధ్యక్షులు పరశురామ రాజు తదితరులు పాల్గొన్నారు.