News April 4, 2025
అర్హులకు లోన్లు అందేలా చర్యలు తీసుకోండి: కలెక్టర్

ఏలూరు జిల్లాలో స్వయం ఉపాధి పథకాల కోసం దరఖాస్తు చేసుకున్న వెనుకబడిన తరగతుల యువతకు రుణాలు మంజూరు చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఎంపీడీఓలతో గురువారం ఏలూరు కలెక్టరేట్ నుంచి సమీక్షించారు. బ్యాంకుల ద్వారా రుణ మంజూరుకు తక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు. రుణాల మంజూరులో ఆటంకాలు ఎదురైతే వెంటనే సంబంధిత అధికారులకు తెలియజేయాలని అధికారులకు సూచించారు.
Similar News
News April 11, 2025
నిర్మల్ జిల్లాలో 1 మి.మీ వర్షపాతం

నిర్మల్ జిల్లాలో గడిచిన 24 గంటల్లో సగటున 1 మిల్లీమీటర్ వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. లోకేశ్వరంలో అత్యధికంగా 7 మి.మీ, సారంగాపూర్ 4.2, దిలావర్పూర్ 0.6, నర్సాపూర్ (జి) 2.0, బాసర 3.4, తానూర్ 1.4, ముధోల్ 0.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.
News April 11, 2025
ట్రంప్ నిర్ణయంతో దూసుకెళ్తున్న భారత మార్కెట్లు

భారత్‌పై టారిఫ్స్‌ను ట్రంప్ 90రోజులు హోల్డ్ చేయడంతో స్టాక్ మార్కెట్లు దూసుకెళ్తున్నాయి. మదుపరులు షేర్ల కొనుగోలుకు మొగ్గు చూపుతున్నారు. దీంతో బీఎస్ఈ సెన్సెక్స్ 1520 పాయింట్లు లాభపడి 75,369 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 496 పాయింట్లు వృద్ధి చెంది 22,895 వద్ద ట్రేడ్ అవుతోంది. అదానీ ఎంటర్‌ప్రైజెస్, టాటా స్టీల్, సిప్లా, JSW స్టీల్, టాటా మోటార్స్ షేర్లు లాభాల్లో టాప్-5లో ఉన్నాయి.
News April 11, 2025
బాపట్ల: రేపే ఇంటర్ ఫలితాలు

ఇంటర్ ఫలితాలు రేపు విడుదల కానున్న నేపథ్యంలో విద్యార్థుల్లో ఉత్కంఠ నెలకొంది. తొలిసారి ఇంటర్ పరీక్షలు రాసిన ఫస్ట్ ఇయర్ విద్యార్థుల కంటే ఎక్కువగా, భవిష్యత్ లక్ష్యాలపై ఆశలు పెట్టుకున్న సెకండ్ ఇయర్ విద్యార్థుల్లో ఆత్రుత కనిపిస్తోంది. బాపట్ల జిల్లాలో ఫస్టియర్ 10,838, సెకండియర్ 8,381, మొత్తం 19,219 మంది పరీక్షలు రాసి రిజల్ట్స్ కోసం ఎదురుచూస్తున్నారు. ఫలితాల కోసం Way2News ఫాలో అవ్వండి.