News March 20, 2025
అలంపూర్: శ్రీ జోగులాంబ అమ్మవారి సేవలో నిరంజన్ రెడ్డి

ఐదో శక్తిపీఠం శ్రీ జోగులాంబ బాల బ్రహ్మేశ్వర ఆలయాలను ఈరోజు సాయంత్రం మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ఉభయ ఆలయాలను దర్శించుకున్నారు. ఆయనకు దేవస్థానం వారు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి అర్చకుల ద్వారా తీర్థప్రసాదం అందించి, ఆశీర్వచనం మండపంలో శేష వస్త్రంతో సత్కరించారు. తదనంతరం తుంగభద్ర నది, నవబ్రహ్మ ఆలయాలను దర్శించుకున్నారు. ఆయన వెంట దేవస్థానం సీనియర్ అసిస్టెంట్ శేఖర్ ఆచారి ఉన్నారు.
Similar News
News March 28, 2025
అనకాపల్లి ఎన్టీఆర్ బెల్లం మార్కెట్‌ను సందర్శించిన కలెక్టర్

అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్, ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ శుక్రవారం స్థానిక ఎన్టీఆర్ బెల్లం మార్కెట్ ను సందర్శించారు. మార్కెట్ యార్డ్ లో సమస్యలను కలెక్టర్‌కు ఎమ్మెల్యే వివరించారు. సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హామీ ఇచ్చారు. రైతు బజార్ ఏర్పాటు చేసి మార్కెట్ యార్డుకు పూర్వ వైభవం తీసుకొస్తామన్నారు. బెల్లం తయారు చేసే విధానాన్ని రైతులను అడిగి కలెక్టర్ తెలుసుకున్నారు.
News March 28, 2025
మామిడికుదురు: పాము కాటుకు గురై యువతి మృతి

మామిడికుదురు మండలం ఆదుర్రు గ్రామానికి చెందిన కంచి శృతి (24) పాము కాటుకు గురై మృతి చెందిన ఘటన శుక్రవారం చోటు చేసుకుంది. ఉదయం 6.గంటల సమయంలో ఇంటి వద్ద బట్టలు ఉతుకుతుండగా చేతిపై పాము కాటు వేయడంతో స్థానికులు వెంటనే రాజోలు ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.
News March 28, 2025
క్రిష్-4తో డైరెక్టర్‌గా మారనున్న హృతిక్

క్రిష్ సిరీస్‌లో నాలుగో సినిమా ‘క్రిష్-4’కు రంగం సిద్ధమైంది. ఆ మూవీ హీరో హృతిక్ రోషన్ ఆ సినిమాకు దర్శకత్వం కూడా చేయనున్నారని ఆయన తండ్రి రాకేశ్ రోషన్ ట్విటర్లో ప్రకటించారు. ‘పాతికేళ్ల క్రితం నిన్ను హీరోగా తెరపైకి తీసుకొచ్చాను. ఇప్పుడు ఆది చోప్రాతో కలిసి నిర్మిస్తూ నిన్ను క్రిష్-4 దర్శకుడిగా కూడా పరిచయం చేస్తున్నాను. ఈ కొత్త పాత్రలో ఆల్ ది బెస్ట్. నా దీవెనలు నీకెప్పుడూ ఉంటాయి’ అని పేర్కొన్నారు.