News April 3, 2025
అల్ ఇండియా క్రికెట్ పోటీల్లో పాల్గొన్న నిర్మల్ బిడ్డ

మార్చి 15 నుంచి 26 వరకు ఢిల్లీలో జరిగిన అల్ ఇండియా సివిల్ క్రికెట్ పోటీలకు పెంబి మండలం లోతర్య తండా గ్రామానికి చెందిన ఉపాధ్యాయుడు సపవత్ కిషోర్ పాల్గొన్నారు. రాష్ట్రజట్టు నుంచి క్రికెట్ పోటీల్లో పాల్గొని వచ్చిన కిషోర్‌ను బుధవారం ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ సన్మానించారు. లక్ష్మణ్, విలాస్, మతీన్ ఉన్నారు.
Similar News
News April 4, 2025
విజయనగరం జిల్లాలో నామినేటెడ్ పోస్టులు వీరికే

విజయనగరం జిల్లాలో పలువురు నాయకులను నామినేటెడ్ పదవులు వరించాయి. విజయనగరం, గజపతినగరం, రాజాం మార్కెట్ కమిటీ ఛైర్మన్లను కూటమి ప్రభుత్వం ప్రకటించింది. రాజాం ఏఎంసీ ఛైర్‌పర్సన్‌గా పొగిరి కృష్ణవేణి(జనసేన), గజపతినగరం మార్కెట్ కమిటీ ఛైర్మన్‌గా పీ.వీ.వీ గోపాలరాజు(టీడీపీ), విజయనగరం ఏఎంసీ ఛైర్మన్‌గా కర్రోతు వెంకటనర్శింగరావుకు(టీడీపీ) అవకాశం ఇచ్చింది.
News April 4, 2025
ధరూర్ నూతన పోలీస్ స్టేషన్‌కు డీజీపీ భూమి పూజ

ధరూర్ మండల కేంద్రంలో రూ.2.65 కోట్ల వ్యయంతో నిర్మాణం చేపట్టే నూతన పోలీస్ స్టేషన్‌కు తెలంగాణ డీజీపీ జితేందర్ ఈరోజు శంకుస్థాపన చేశారు. ధరూర్ మండలానికి ఇప్పటికే జూరాల దగ్గర పోలీస్ స్టేషన్ ఉన్నప్పటికీ నూతన పోలీస్ స్టేషన్ నిర్మాణానికి ఈరోజు భూమి పూజ చేశారు. ఆయన వెంట గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ఎస్పీ శ్రీనివాస్, డీఎస్పీ తదితరులు పాల్గొన్నారు.
News April 4, 2025
కడప: ఒంటిమిట్టకు 135 ప్రత్యేక బస్సులు

కడప జిల్లా పరిధిలోని వివిధ ప్రాంతాల నుంచి ఒంటిమిట్ట క్షేత్రానికి 135 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసినట్లు జిల్లా రవాణా అధికారి గోపాల్ రెడ్డి పేర్కొన్నారు. ఈ నెల 11వ తేదీన ఒంటిమిట్ట క్షేత్రంలో సీతారామ కళ్యాణ మహోత్సవం సందర్భంగా భక్తుల సౌకర్యార్థం ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. కడప 35, జమ్మలమడుగు 10, మైదుకూరు 5, ప్రొద్దుటూరు 15, బద్వేలు 20, పులివెందుల 10 ఇతర ప్రాంతాల నుంచి మిగతా బస్సులు ఉంటాయన్నారు.