News March 29, 2025
అల్లా కటాక్షంతో ప్రజలు సుభిక్షంగా వర్ధిల్లాలి: CM రేవంత్

రంజాన్ మాసం ఎంతో పవిత్రమైందని రంజాన్ మాసంలో ముస్లిం సోదరులు ఉపవాస దీక్షలతో అల్లాను కొలుస్తారని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం కొడంగల్ పట్టణంలో ప్రభుత్వ పరంగా నిర్వహించిన “రంజాన్ ఇఫ్తార్ విందు”లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అల్లా కటాక్షంతో ప్రజలు సుభిక్షంగా ఉండాలన్నారు. ప్రజా ప్రతినిధులు, మైనారిటీ సోదరులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.
Similar News
News April 2, 2025
MBNR: నేటి నుంచి 30వ తేదీ వరకు జిల్లాలో పోలీస్ యాక్ట్

మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా నేటి నుంచి ఈనెల 30వ తేదీ వరకు 30 పోలీస్ యాక్ట్ 1961 అమలులో ఉంటుందని ఎస్పీ జానకి ధరావత్ వెల్లడించారు. పోలీసుల అనుమతులు లేకుండా ఎటువంటి మీటింగులు, ఊరేగింపులు, ధర్నాలు నిర్వహించకూడదన్నారు. నిషేధిత కత్తులు, చాకులు, కర్రలు, జెండా కర్రలు, తుపాకులు, పేలుడు పదార్థాలు వాడకూడదన్నారు. డీజేలు లౌడ్ స్పీకర్లను కూడా పూర్తిస్థాయిలో నిషేధించామన్నారు.
News April 2, 2025
ఊర్కోండ: ఒంటరి మహిళ, ప్రేమ జంట కనిపిస్తే అంతే సంగతులు!

ఊర్కోండ మండలంలోని పేట ఆంజనేయ స్వామి దేవాలయం సమీపంలో వివాహితపై 8 మంది సామూహిక అత్యాచారం చేసిన ఘటన జిల్లాలో సంచలనం సృష్టించింది. కొంతకాలంగా దేవాలయం వద్దకు వచ్చే మహిళల పట్ల పోకిరీల ఆగడాలు అధికమైనట్లు తెలుస్తుంది. గతంలో అనేకమంది మహిళలకు వేధింపులు ఎదురైనట్లు ఆరోపణలు ఉన్నాయి. పోలీసులు తమదైన శైలిలో విచారణ చేస్తే మరిన్ని నిజాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.
News April 2, 2025
బాలానగర్: రోడ్డు ప్రమాదం వ్యక్తి మృతి

గుర్తు తెలియని వాహనం ఢీకొని ఓ బీహార్ వాసి మృతి చెందిన ఘటన బాలానగర్ మండల కేంద్రంలో జరిగింది. ఎస్ఐ లెనిన్ వివరాల ప్రకారం.. బీహార్‌కి చెందిన బినోద్ ముర్ము(32) మండల కేంద్రం శివారులోని ఓ కంపెనీలో పనిచేస్తున్నాడు. మంగళవారం రోడ్డు దాటుతుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో అక్కడికక్కడే మరణించాడు. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు.