News March 15, 2025
అల్లూరి: ఇంటర్ పరీక్షలకు 195మంది గైర్హాజరు

అల్లూరి జిల్లాలో 26 పరీక్ష కేంద్రాల్లో శనివారం ద్వితీయ ఇంటర్ జనరల్ కెమిస్ట్రీ, కామర్స్ పరీక్షలు జరిగాయి. జనరల్ పరీక్షలకు మొత్తం 4,170మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా 4050మంది రాసారని, 116ఆబ్సెంట్ అయ్యారని జిల్లా ఇంటర్మీడియేట్ విద్యాధికారి అప్పలరాం తెలిపారు. 8కేంద్రాల్లో ఒకేషనల్ పరీక్షలకు 884మందికి గాను 805మంది హాజరు అయ్యారని, 79మంది ఆబ్సెంట్ అయ్యారని తెలిపారు.
Similar News
News March 17, 2025
MBNR: చెరువులో మునిగి వ్యక్తి మృతి

జిల్లాకేంద్రంలో ఓ వ్యక్తి చెరువులో మునిగి మృతిచెందిన ఘటన చోటుచేసుకుంది. పోలీసుల వివరాలు.. వేపూరిగేరికి చెందిన అశోక్(38) ప్రింటింగ్ ప్రెస్‌లో రోజువారి వర్కర్‌గా పనిచేస్తున్నారు. అయితే హోలీ ఆడిన తర్వాత మద్యం తాగి వెంకటాపూర్ శివారులో ఉన్న చెరువులో స్నానం కోసం వెళ్లాడు. నీటిలోకి దిగిన తర్వాత నీట మునిగిపోవటంతో ఊపిరి ఆడక మృతిచెందాడు. రెండు రోజుల తర్వాత మృతదేహం బయటపడింది. ఈ మేరకు కేసు నమోదైంది.
News March 17, 2025
బీసీ రిజర్వేషన్ బిల్లుకు అన్ని పార్టీల మద్దతు కూడగట్టాలి:మంత్రి పొన్నం

బీసీలకు స్థానిక సంస్థల్లో, విద్య, ఉద్యోగాల్లో 42 శాతం రిజర్వేషన్లు పెంచుతూ శాసనసభలో బిల్లు ప్రవేశపెట్టనుండడంతో బిల్లుకు అన్ని పార్టీల మద్దతు కూడాగట్టాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఈ విషయమై కాంగ్రెస్ పార్టీ బీసీ ఎమ్మెల్యేలతో మంత్రి సమావేశం నిర్వహించారు. మొదటిసారి చారిత్రాత్మక బీసీ రిజర్వేషన్ పెంచుతూ బిల్లు ప్రవేశ పెట్టడం జరుగుతుందన్నారు. మంత్రి కొండ సురేఖ, విప్ ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు.
News March 17, 2025
HYD: అమెరికాలో ప్రమాదం.. కొందుర్గు వాసులు మృతి

అమెరికాలోని ఫ్లోరిడాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో రంగారెడ్డి జిల్లా వాసులు చనిపోయారు. కొందుర్గు మండలంలోని టేకులపల్లికి చెందిన BRS నాయకుడు, మాజీ MPTC, మాజీ సర్పంచ్ మోహన్ రెడ్డి కూతురు ప్రగతిరెడ్డి(35), మనవడు హార్వీన్ (6), సునీత (56) మృతి చెందారు. ప్రగతి అత్త సునీత సిద్దిపేట జిల్లా బక్రీ చప్రియాల్ గ్రామం. అయితే, అంత్యక్రియలు అక్కడే చేస్తున్నట్లు సమాచారం.