News March 1, 2025
అల్లూరి: ఇంటర్ పరీక్షలు.. 666 మంది గైర్హాజరు

అల్లూరి జిల్లాలో శనివారం జరిగిన ఇంటర్ పరీక్షలకు 666మంది అయ్యారని జిల్లా ఇంటర్మీడియెట్ విద్యాధికారి అప్పలరాం తెలిపారు. సాధారణ పరీక్ష తెలుగు 1కి 6,350 మంది విద్యార్థులకు గాను 5,892 మంది హజరైయ్యారని అని పేర్కొన్నారు. 458మంది హాజరు కాలేదని తెలిపారు. ఒకేషనల్ పరీక్షకు 1,301 మంది విద్యార్థులకు గాను 1,093 మంది హజరు కాగా 208మంది గైర్హాజరు అయ్యారని తెలిపారు.
Similar News
News March 1, 2025
పాల్వంచ: సదరం కార్డుకు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి..

ప్రత్యేక వైకల్య గుర్తింపు కార్డు కోసం యూడీఐడీ పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సెర్ప్ సీఈవో దివ్య దేవరాజన్ తెలిపారు. శనివారం సదరం క్యాంపులు, ప్రత్యేక వైకల్య గుర్తింపు కార్డులు, సోలార్ ప్లాంట్ల ఏర్పాటుపై భద్రాద్రి జిల్లా కలెక్టర్ స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందన, ఆర్ఎంవో రమేశ్‌తో సెర్ప్ సీఈవో దివ్య దేవరాజన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు.
News March 1, 2025
ADB ఇంటర్ బోర్డు అధికారిగా జాధవ్ గణేశ్

ఆదిలాబాద్ ఇంటర్ బోర్డు అధికారిగా (DIEO) GJC ప్రిన్సిపల్ జాధవ్ గణేశ్ కుమార్‌ను నియమిస్తూ ఇంటర్ బోర్డు ఉత్తర్వులు జారీ చేసింది. ఇదివరకు DIEOగా ఉన్న రవీందర్ కుమార్ పదవి విరమణ చేయడంతో ఆయన స్థానంలో గణేశ్‌ను నియమించారు. ఈ మేరకు ఆయన శనివారం DIEOగా బాధ్యతలు స్వీకరించారు. బోర్డు సిబ్బంది ఆయనకు శుభాకాంక్షలు చెప్పి స్వాగతించారు.
News March 1, 2025
MBNR: హక్కుల కోసం కలిసి ముందు కెళ్దాం: మాజీ మంత్రి

గౌడ్స్ హక్కుల కోసం అందరం కలిసికట్టుగా ముందుకెళ్దామని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పిలుపు నిచ్చారు. HYD నెక్లెస్ రోడ్‌లోని నీరా కేఫ్‌లో గౌడ్ సంఘాల నాయకులతో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో మాజీ మంత్రి పాల్గొని మాట్లాడారు. మహాసభ ఏర్పాటు చేసుకొని భవిష్యత్ కార్యాచరణతో ముందుకు వెళ్దామన్నారు. నీరా కేఫ్ పై ప్రభుత్వంలో కదలిక రావడం సంతోషమన్నారు. షరతులు లేకుండా నీరా కేఫ్‌ని టాడీ కార్పొరేషన్‌కి అందించాలన్నారు.