News April 5, 2025
అల్లూరి: గర్భిణిగా నాటకం ఆడిన మహిళ

అల్లూరి జిల్లా దేవిపట్నం మండలం ఇందుకూరిపేటకి చెందిన ఓ మహిళ కాన్పు కోసం రాజమండ్రిలోని ప్రైవేట్ ఆసుపత్రికి వచ్చింది. అనంతరం అదృశ్యమైంది. ఆమెను కాకినాడ పోలీసులు గుర్తించారు. కాకినాడ జీజీహెచ్‌లో తనకు పుట్టిన పిల్లలను ఎవరో ఎత్తుకుపోయారని ఆమె చెప్పింది. గట్టిగా విచారించడంతో 9నెలలు గుడ్డ ముక్కలు పెట్టుకుని గర్భం పెరుగుతున్నట్లు నమ్మించినట్లు ఆమె తెలిపింది.
Similar News
News April 6, 2025
HYD: చికెన్ దుకాణాలు ఖాళీ

మాంసం ప్రియులకు సండే పండగే. ఉదయం చికెన్, మటన్ షాపుల వద్ద క్యూలైన్లు, కిటకిటలాడే గిరాకీ షరామామూలే. కానీ, ఈ ఆదివారం శ్రీ రామ నవమి కావడంతో దృశ్యం పూర్తిగా మారిపోయింది. ప్రతాపసింగారం సహా HYDలోని అనేక మాంసం దుకాణాలు వెలవెలబోయాయి. ఎప్పుడూ జనసంద్రంగా మారే మార్కెట్లు నిర్మానుష్యంగా కనిపించాయి. ఇదే సీన్ గత వారం ఉగాది రోజూ కనిపించింది. పండుగల దెబ్బకు అమ్మకాలు పూర్తిగా తగ్గాయని వ్యాపారస్థులు చెబుతున్నారు.
News April 6, 2025
అమరావతిలో కొత్త రైలు మార్గానికి శుభారంభం

ఎర్రుపాలెం-నంబూరు మధ్య నూతన రైల్వేలైన్ నిర్మాణానికి ఏర్పాట్లు ఊపందుకున్నాయి. ఈ మేరకు అమరావతి మీదుగా వెళ్లే ఈ మార్గానికి భూసేకరణలో పురోగతి కనిపించడంతో, రైల్వేశాఖ పనులు ప్రారంభించేందుకు సన్నద్ధమవుతోంది. తొలి దశలో 27 కిలో మీటర్ల రైలు ట్రాక్, కృష్ణా నదిపై వంతెన నిర్మాణానికి టెండర్‌లు రెండు నెలల్లో పిలవనున్నట్లు సమాచారం.
News April 6, 2025
భద్రాద్రి: గెస్ట్ హౌస్ నుంచి మిథిలా స్టేడియానికి సీఎం

బూర్గంపాడు మండలం సారపాక ఐటీసీ గెస్ట్ హౌస్‌కు సీఎం రేవంత్ రెడ్డి చేరుకున్నారు. అక్కడి నుంచి భద్రాచల సీతారామ చంద్ర స్వామి వారి కళ్యాణానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, ఎంపీ బలరాం నాయక్, ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, తెల్లం వెంకటరావుతో కలిసి మిథిలా స్టేడియానికి వెళ్లారు.