News February 18, 2025

అల్లూరి జిల్లాలో 71 పరీక్షా కేంద్రాలు: డీఈవో

image

పదోతరగతి పరీక్షలకు అల్లూరి జిల్లాలో 71 సెంటర్లు ఏర్పాటు చేస్తున్నామని DEO బ్రహ్మాజీరావు సోమవారం తెలిపారు. పాడేరు డివిజన్‌లో 43, రంపచోడవరం డివిజన్‌లో 18, చింతూరు డివిజన్‌లో 10 కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. మొత్తం 11,766 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారని, వీరిలో 202 మంది ప్రైవేట్ స్టూడెంట్స్ ఉన్నారని వెల్లడించారు. 100రోజులు ప్రణాళికతో విద్యాబోధన జరుగుతుందన్నారు.

Similar News

News December 14, 2025

భూపాలపల్లి: 9 AM 26.40 శాతం పోలింగ్ నమోదు

image

భూపాలపల్లి జిల్లాలో మలివిడత ఎన్నికల లో 9 గంటల వరకు 26.40 శాతం నమోదైనట్లు డిపిఓ శ్రీలత తెలిపారు. చిట్యాల 27.04 శాతం, భూపాలపల్లి 27.28 శాతం, టేకుమట్ల 23.88 శాతం, పలిమెల 28.50 శాతం పోలింగ్ నమోదైనట్టు జిల్లా పంచాయతీ అధికారి శ్రీలత తెలిపారు. జిల్లాలో 21,841 మంది హక్కు వినియోగించుకున్నారు. జిల్లాలో నాలుగు మండలాల్లో 82,728 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.

News December 14, 2025

ఖమ్మం: పోలింగ్ రోజే సర్పంచ్ అభ్యర్థి మృతి

image

నేలకొండపల్లి మండలం అనాసాగరం ఇండిపెండెంట్ సర్పంచ్ అభ్యర్థి దామల నాగరాజు (40) మృతి చెందారు. ఎంఎస్సీ, బీఈడీ చదివి ప్రైవేట్ లెక్చరర్‌గా పనిచేస్తున్న ఆయన సర్పంచ్‌గా పోటీ చేస్తున్నాడు. రెండో విడతలో భాగంగా ఈరోజు పోలింగ్ జరుగుతోంది. ఈ విషాద ఘటన గ్రామంలో విషాదం నింపింది. నామినేషన్ వేసిన రోజే అస్వస్థతకు గురైన నాగరాజును ఆసుపత్రిలో చేర్పించారు. ఈరోజు బ్రెయిన్‌డెడ్‌ అయ్యి మృతి చెందినట్లు బంధువులు తెలిపారు.

News December 14, 2025

15న నెల్లూరుకు ఢిల్లీ CM రాక

image

నెల్లూరు హరినాథపురంలో మాజీ ప్రధాని వాజ్‌పేయీ విగ్రహావిష్కరణ జరగనున్నట్లు బీజేపీ జిల్లా అధ్యక్షుడు శీపారెడ్డి వంశీధర్ రెడ్డి తెలిపారు. ఈనెల 15న జరిగే ఈ కార్యక్రమంలో బీజేపీ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు. ఆరోజు అటల్ – మోదీ సుపరిపాలన యాత్ర జరగనున్నట్లు చెప్పారు. ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా హాజరవుతారని తెలిపారు.